జనసైనికుల తవ్వకాలు..! బీజేపీ విష్ణు ట్వీట్ల డంప్‌ చాలా కంపు..!

సమీరా రెడ్డి… మ్చ్…! నందినీ రెడ్డి రాక్స్..! జగన్ రెడ్డి గ్రేట్..! కిరణ్ కుమార్ రెడ్డి సూపర్..! కమ్మ కుXXXXలు..!… ఇవి కొన్ని ట్వీట్లే.. ఇంకా చెప్పుకోలేని.., రాసుకోలేని.. కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. కులాలు, మతాల్ని గౌరవించే ప్రశ్నే లేదు. సినీ హీరోయిన్లను… “మరో” రకంగా చూసే వ్యక్తిత్వం తలపండిపోయినట్లుగా కనిపిస్తుంది. ఓ కులం నటులంటే.. పడి చచ్చిపోయే వ్యక్తిత్వం. మరో కులం అంటే… బండబూతులు తిట్టేంత అసహ్యం. ఇవన్నీ.. నిన్న ఒక్క సారిగా బయటకు వచ్చి పడిన ట్వీట్ల డంప్ లోని విశేషాలు. ఆ ట్వీట్లు చేసింది.. ఎవరో సాదాసీదా రాజకీయ పార్టీ కార్యకర్త అయితే లైట్ తీసుకునేవాళ్లు. కానీ.. వ్యక్తిత్వాలు, విలువలు… అంటూ.. పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీలో ఉంటూ.. ఆ పార్టీ తరపున కేంద్ర నామినెటెడ్ పదవి సైతం అనుభవిస్తున్న పెద్ద నోరున్న నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్లు అవి.

కుల, మత దూషణ… మహిళల అంగాంగవర్ణనల ట్వీట్లు..!

కాకపోతే.. ఆయన ఇప్పుడు చేసినవి కాదు. పదేళ్ల కిందటి ట్వీట్లు. అప్పుడు ఆయన అనామకుడు. ఎవరికీ తెలియదు. ఎవరూ పట్టించుకునే పర్సనాల్టీ కాదు. తనకు మాత్రమే తెలిసిన సర్కిల్స్‌లో.. ట్వీట్లు చేసుకుని తన అభిప్రాయాలు తెలియచేసుకునేవాడు. అప్పటి ట్వీట్లు.. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి.. అత్యంత వల్గర్ లాంగ్వేజ్‌లో… ట్వీట్లు చేశారు. ఇప్పుడు అది ఆయన మెడకు చుట్టుకుంటోంది. అత్యంత అసహ్యమైన విషయం ఏమిటంటే.. ఈయన కుల, మత దూషణను మాత్రమే కాదు.. ఆడవాళ్లను కూడా గౌరవించే వ్యక్తి కాదు. వారి శరీరభాగాలను కూడా వర్ణించి.. ట్వీట్లు చేసిన రాజకీయ నేత.

పార్టీ అభిమానం కన్నా.. కులాభిమానమే మిన్న..!

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి …కావాల్సిన విధంగా నోరు చేసుకునే ఎదిగుతున్న రాజకీయనేత. మీడియా చానళ్ల పుణ్యం.. బీజేపీ అంటే భయభక్తులు ఏర్పర్చుకున్న చానళ్ల దైన్యంతో కలసి వచ్చిన అవకాశాన్ని ఆయన టీవీ చానళ్ల ద్వారా బాగానే ఉపయోగించుకున్నారు. గత టీడీపీ హయాంలో ఆయన టీవీ చానళ్లకు ఎక్కి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూడా… టీడీపీపై అదే చేస్తున్నారు. జగన్‌పై.. సాఫ్ట్‌ కార్నర్ చూపిస్తూంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీనే ఎక్కువగా విమర్శిస్తూంటారు. దానికి కారణం.. ఆయన .. తన కులాన్ని అత్యంత అమితంగా అభిమానించడం.. తన కుల నాయకుడిగా ఉన్న పార్టీపై.. సొంత పార్టీ కన్నా అమితంగా అభిమానం చూపడమే కారణమని ఈ ట్వీట్ల ద్వారా తేలిపోయింది.

తవ్వి తీసిన జనసైనికులు..!

విష్ణువర్ధన్ రెడ్డి గోముఖ వ్యాఘ్రాం తరహా వ్యక్తి అని .. చాలా రోజులుగా.. జనసేన నేతలు విమర్శిస్తున్నారు. ఆయన బయటకు చెప్పేది ఒకటి.. అసలు ఆయన వ్యక్తిత్వం ఇంకోకటని.. చెబుతూ వస్తున్నారు. దీన్ని నిజం చేసేందుకు… వారు.. విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ల డంప్‌లో తవ్వకాలు చేశారు. ఎప్పుడో పదేళ్ల కిందటి.. ఆయన వ్యక్తిత్వ చరిత్రను వెలికి తీశారు. వారు అలా బయటకు తీసిన ఒక్కొక్క ట్వీట్ … బంబులా పేలింది.

“నోరే”సుకుని సమర్థించుకుంటే తప్పు ఒప్పయిపోతుందా..?

తన పాత ట్వీట్ల డంప్ ఒక్క సారిగా బయటపడిందని… వైరల్ అయిపోయాయని తెలిసిన తర్వాత విష్ణువర్దన్ రెడ్డి..హుటాహుటిన మేల్కొన్నారు. మొదట వైరల్ అయిన కొన్ని ట్వీట్లు డిలిట్ చేసి.. హమ్మయ్య అనుకున్నారు. కానీ.. ఆయన ఘనకార్యాలు.. ఒకటి, రెండు ట్వీట్లతో.. ఆగిపోలేదు. కొన్ని వందలున్నాయి. అవన్నీ… హైలెట్ అవడం ప్రారంభించాయి. దాంతో.. వెంటనే.. ట్విట్టర్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసుకున్నారు. అది తన అకౌంట్ కాదని.. చెబుతూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. బహుశా.. ఈ రోజు లేదా ఆయన మీడియా ముందుకొచ్చి… రాముడు – భీముడు సినిమా చూపించినా ఆశ్చర్యం లేదు. ఆయన అకౌంట్ కాకపోతే… ఆ ట్వీట్లు వైరల్ అయిన వెంటనే.. ఎలా డిలీట్ చేసుకుంటారు..? ఎలా డి యాక్టివేట్ చేసుకుంటారు..?. ఆ అకౌంట్ తనదేనని తనే సాక్ష్యం ఇస్తున్నట్లుగా… చేసుకుంటున్నాననే లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

https://threadreaderapp.com/thread/1190296798889332736.html

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close