ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారమే అంతా..!?

ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు వైసీపీ నేతల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగుతున్న కొన్ని పరిణామాలు వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం వెనుక బీజేపీ ఉందనే ప్రచారంతో పాటు.. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ కూడా.. పై స్థాయి ప్రమేయం లేకపోతే.. బయటకు రాదని అనుకుంటున్నారు. రమేష్ కుమార్ లేఖ.. ఢిల్లీ నుంచే బయటకు వచ్చిందన్న అనుమానం.. వైసీపీ నేతల్లో బలపడుతోంది. దీనికి కారణం… అలా లేఖ బయటకు రాగానే.. ఇలా.. సీఎస్‌కు.. కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. రమేష్‌కుమార్‌కు సెంట్రల్ ఫోర్స్‌లతో భద్రత కల్పించడమే కాదు.. ఆయన.. హైదరాబాద్ నుంచి విధులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేశారు. అలాగే.. ఎస్‌ఈసీ లేఖపై గవర్నర్ ఇలా అధికారులను పిలిపించి మాట్లాడారు.

సీఎంవో అధికారులు కూడా రాజ్ భవన్ కు వెళ్లటం కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ వెనుక కేంద్రంలోని కొంతమంది కీలక నేతల అండ ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. లేనిపక్షంలో ఎన్నికల కమిషనర్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోరని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో.. ముగ్గురు బీజేపీ ఎంపీలు నేరుగా అమిత్ షాను కలిసిన తర్వాత.. కన్నా లక్ష్మినారాయణ లేఖలు రాయడం.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిపోతున్నాయి.

చివరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని లేఖ రాసిన గంట వ్యవధిలోనే ఇదే డిమాండ్ తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి కమిషనర్ రమేష్ కుమార్ కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. ఆ తర్వాత వెంటనే భద్రత కల్పించారు. ఈ సంఘటనలన్నిటినీ పరిశీలిస్తే కేంద్రం ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం ప్రారంభించిందని అన్ని పార్టీల నేతలకు ఓ క్లారిటీ వచ్చింది. వైసీపీ అగ్రనాయకత్వానికి కూడా అదే అనుమానం ప్రారంభమయింది. కానీ బీజేపీని ఏమీ అనలేక.. టీడీపీపై కుట్ర సిద్ధాంతం వినిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close