గోపీచంద్ కోసం బాలీవుడ్ భామ‌

గోపీచంద్ – సంప‌త్ నంది కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి `సిటీమార్‌` అనే పేరు ఫిక్స్ చేశారు. త‌మ‌న్నా క‌థానాయిక‌. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. గోపీచంద్, త‌మ‌న్నా ఇద్ద‌రూ క‌బ‌డ్డీ కోచ్‌లుగా క‌నిపించ‌బోతున్నారు. క్రీడా నేప‌థ్య‌మే అయినా.. మంచి మాస్ మ‌సాలా అంశాల‌న్నీ జోడించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు సంప‌త్ నంది. త‌న సినిమాల్లో పాట‌లు బాగుంటాయి. వాటిని తెర‌కెక్కించే తీరూ బాగుంటుంది. ఈసారీ సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అల‌వాటు ప్ర‌కారం ఓ మాంచి ఐటెమ్ గీతాన్నీ జోడించార్ట‌. ఈ పాట‌లో బాలీవుడ్ భామ ఊర్వ‌శీ రౌటేలా క‌నిపించ‌బోతోంది. `గ్రాండ్ మ‌స్తీ`, `కాబిల్` లాంటి చిత్రాల్లో మెరిసింది ఊర్వ‌శీ. మాంచి హాట్ గాళ్‌గా పేరు తెచ్చుకుంది. త‌న‌కు ఇదే తొలి సౌత్ ఇండియ‌న్ చిత్రం కాబోతోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. లాక్ డౌన్ ఎత్తేసిన త‌ర‌వాత‌.. పాట‌ల్ని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న...

ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా... వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం...

సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ...

క్రాక్ .. పరిశ్రమకి ధైర్యం ఇచ్చింది: గోపీచంద్ మలినేనితో ఇంటర్వ్యూ

రవితేజ, గోపీచంద్ మలినేని కలసి హ్యాట్రిక్ కొట్టేశారు. సంక్రాంతి విజేతగా నిలిచింది క్రాక్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులకు హైవోల్టేజ్ వినోదం ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద హంగామా చేస్తుంది. కరోనా...

HOT NEWS

[X] Close
[X] Close