క్రాక్‌పై బాలీవుడ్ దృష్టి

తెలుగులో ఓ మంచి సినిమా వ‌స్తే చాలు.. రీమేక్ రైట్స్ ఎగ‌రేసుకుపోవ‌డానికి బాలీవుడ్ రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతోంది. యావ‌రేజ్ సినిమానీ వ‌ద‌ల‌డం లేదు. అర్జున్ రెడ్డి రీమేక్ హిట్ట‌యిన త‌ర‌వాత‌… ఆ జోరు మ‌రింత ఎక్కువైంది. `జెర్సీ` బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఇప్పుడు వాళ్ల దృష్టి `క్రాక్‌`పై ప‌డింది. ఈ సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్ హిట్ చిత్రాల జాబితాలో నిలిచిపోయిన సినిమా `క్రాక్‌`. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవ్వ‌డానికి రెడీ అవుతోంది.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. ఇప్ప‌టికే కొంత‌మంది బాలీవుడ్ నిర్మాత‌లు.. ఠాగూర్ మ‌ధుని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. గోపీచంద్ మ‌లినేని మాత్రం `ఈ సినిమాని బాలీవుడ్ లోనూ నేనే తీస్తా` అంటున్నాడ‌ట‌. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్ అక్ష‌య్ కుమార్‌కి బాగా స‌రిపోతుంది. ఇక్క‌డి `విక్ర‌మార్కుడు`ని అక్ష‌య్ నే రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. ఈసారీ.. `క్రాక్‌`లో హీరో త‌నే కావొచ్చు. ఏ భాష‌లో వ‌చ్చినా.. పోలీస్ క‌థ‌ల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌లిచే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. `క్రాక్‌` ఇప్పుడు హాట్ కేక్ గా మారింది. గోపీచంద్ మ‌లినేని ష‌ర‌తుకు.. నిర్మాత‌లు ఓకే అంటే.. అతి త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసే ఛాన్స్ వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో...

బెజవాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ గ్రూప్ తగాదాలు

విజయవాడలో టీడీపీ నాయకులు .. ఎన్నికలకు ముందే ఆ పార్టీని ఓడగొడుతున్నారు. అధికార పార్టీ దూకుడుని తట్టుకుని ఎంతో కొంత గెలుపు చాన్స్ ఉందని అనుకుంటున్న బెజవాడ నేతలు.. పోలింగ్...

బాలకృష్ణ కొడితేనే వైరల్.. కొట్టకపోతే నార్మల్..!

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకున్నారు. నిజంగా ఆయన కొట్టకపోతేనే వార్త. కొడితే వార్త ఎందుకవుతుంది. పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతీసారి తన చేతికి పని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన చేతి...

కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని నాయకులు: విజయసాయి పై బాలయ్య విసుర్లు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ప్రచారంలో అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మీద వరసబెట్టి విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి బాలయ్య చేసిన విమర్శలు...

HOT NEWS

[X] Close
[X] Close