జలాలాబాద్ లోని భారతదౌత్య కార్యాలయం సమీపంలో బాంబు ప్రేలుడు

ఆఫ్ఘనిస్తాన్ లోని మజారి షరీఫ్ నగరంలో భారత దౌత్య కార్యాలయంపై రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు దాడులు చేసారు. ఉగ్రవాదులు అందరినీ మట్టుబెట్టి ఈరోజు ఉదయమే కమెండో ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. మళ్ళీ కొన్ని గంటల వ్యవధిలోనే ఈసారి ఆఫ్ఘనిస్తాన్ లో జలాలాబాద్ లో భారత దౌత్య కార్యాలయం, భారతీయుల దుఖాణాలు ఉండే ప్రాంతంలో కొద్ది సేపటి క్రితం బారీ బాంబు ప్రేలుడు జరిగింది. అది భారత దౌత్యకార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపినదేనా లేదా అనే విషయం ఇంకా తేలవలసి ఉంది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]