బొత్స అమరావతి పరిశీలన.. ఫర్ సేల్ బోర్డు పెట్టడానికా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇటీవలి కాలంలో అమరావతి విషయంలో కాస్తంత స్పందన కనిపిస్తోంది. చివరి దశకు వచ్చిన భవనాలనుపూర్తి చేయాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలొచ్చాయని మీడియాలో ప్రచారం జరిగింది. అమరావతిలో ఏమీ లేదు.. మొత్తం గ్రాఫిక్సేనని .. స్మశానం అని… ఎడారి అని.. విమర్శలు గుప్పించిన సీఆర్డీఏ మంత్రి బొత్స సత్యనారాయణ… వాటిని రెండు రోజుల పాటు పరిశీలించారు. ఇంకా కొంత మిగిలిపోతే.. మళ్లీ వస్తానని అధికారులకు చెప్పారు. ఈ హడావుడి చూసి.. అమరావతి విషయంలో మనసు మార్చుకున్నారేమో అని చాలా మంది అనుకోవడం ప్రారంభించారు. కానీ.. ఇప్పుడిప్పుడే సీఆర్డీఏ వర్గాలు ఓ కొత్త విషయాన్ని చెబుతున్నాయి. ఏమింటంటే.. అక్కడ నిర్మించిన భవనాలను అమ్మేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందట.

ఆ టవర్లన్నీ అమ్మే సన్నాహాల్లోనే బొత్స పర్యటన..!?

అమరావతిలో గత ప్రభుత్వం మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసాల కోసం భారీ రెసిడెన్షియల్‌ టవర్లను నిర్మించింది. ఒక్కొక్కటి 12 అంతస్తులతో కూడిన సుమారు 63 రెసిడెన్షియల్‌ టవర్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. వీటన్నింట్లో కలిపి సుమారు 4,200లకుపైగా ఫ్లాట్లు ఉంటాయి. మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్‌ అఖిల భారత సర్వీస్‌ అధికారుల కోసం 180 బంగళాల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది. వీటిలో అత్యధికం 80 శాతంమేర పూర్తయ్యాయి. ఏడాది నుంచి పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడే ప్రభుత్వంలో కదలిక కనిపిస్తోంది.

తక్కువ ధరకైనా తెగనమ్మాలనే సీఆర్డీఏకి సూచనలు.. !

రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు… కట్టిన టవర్లను పూర్తి చేసి.. రియల్ ఎస్టేట్ తరహాలో అమ్మేడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని సీఆర్డీఏ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. భవనాల పూర్తికి ఇంకెంత ఖర్చు అవుతుంది.. అమ్మేస్తే ఎంత ఆదాయం వస్తుందో.. సీఆర్డీఏ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడు వేల కోట్ల వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్ ధర కన్నా… 20 శాతం తక్కువ ధర నిర్ణయిస్తే.. డిమాండ్ బాగుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

హ్యాపీనెస్ట్ కొన్నవాళ్లే వద్దంటున్నారు.. కొత్త వారు కొంటారా..?

ఇప్పటికే అమరావతిలో… ప్రజల కోసం హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్‌ను సీఆర్డీఏ చేపట్టింది. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు అన్నీ ప్రాజెక్ట్ ప్రారంభించిన రోజునే అయిపోయాయి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ కొనుగోలు దారుల్లో ఒక్కంటే.. ఒక్కరు కూడా.. తమకు ఇప్పుడు ఫ్లాట్ కావాలని అడగడం లేదు. ప్రభుత్వం రాజధానిని మార్చాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ.. ఏపీ సర్కార్ ఆ ప్రాజెక్టుకూ రివర్స్ టెండర్లు పిలిచింది. డబ్బులు కట్టిన వాళ్లే అక్కడ వద్దని వెనక్కి పోతూంటే… కొత్తగా డిమాండ్ వస్తుందని ప్రభుత్వం మాత్రం ఆశల పల్లకీలో ఉంది. అయితే.. ఓ రాజధాని కోసం .. కట్టిన ప్రభుత్వ ఆస్తుల్ని ఇలా అమ్మేయాలనే ఆలోచన నిజం అయితే మాత్రం.. ఓ మిరకిలే అవతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

భార‌తీరాజా సీక్వెల్‌లో.. కీర్తి సురేష్‌?

భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎర్ర‌గులాబీలు` సూప‌ర్ హిట్ అయ్యింది. ఇళ‌య‌రాజా సంగీతం, శ్రీ‌దేవి గ్లామ‌ర్‌, క‌మ‌ల్ న‌ట‌న‌.. ఇవ‌న్నీ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 40...

HOT NEWS

[X] Close
[X] Close