నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో ర‌ఘు కుంచె

ఈమ‌ధ్య విడుద‌లైన చిత్రాల‌లో `ప‌లాస‌` అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. విమ‌ర్శ‌కుల్ని మెప్పించింది. ఈ సినిమాలో షావుకారుగా చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌రిచి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు ర‌ఘు కుంచె. స్వ‌త‌హాగా సంగీత ద‌ర్శ‌కుడైన ర‌ఘు కుంచెకి అప్పుడ‌ప్పుడూ మేక‌ప్ వేసుకుని న‌టుడిగా మారిన అనుభ‌వం ఉంది. కానీ… ఇంత పూర్తి స్థాయి పాత్ర‌లో ఎప్పుడూ క‌నిపించ‌లేదు. ప‌లాస ఎఫెక్ట్ తో ర‌ఘుకి ఇప్పుడు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ రూపొందించే ఓ వెబ్ సిరీస్ లో రఘుకి కీల‌క పాత్ర దొరికిన‌ట్టు స‌మాచారం. అంతే కాదు.. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతున్న ఓ బ‌యోపిక్ లో ర‌ఘుకి మంచి పాత్ర ప‌డింద‌ట‌. అది ఓ రాజ‌కీయ‌నాయ‌కుడి బ‌యోపిక్ అని, ఓ ప్రముఖ ద‌ర్శ‌కుడు ఈ బ‌యోపిక్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు నిర్మాత‌గానూ ర‌ఘు కుంచె కొన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. జీ 5లో విడుద‌లైన `47 డేస్‌`కి త‌నే నిర్మాత‌. స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. స‌త్య‌దేవ్‌తోనే ర‌ఘు మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close