తాత్కాలిక కట్టడాలపై ప్రజాధనం దుబారా చేస్తున్నారు: బొత్స

చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉంటూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు, పొరుగు రాష్ట్రంలో ఉంటూ రాష్ట్రాన్ని పాలించడమేమిటి? విజయవాడకు ఇంకా ఎప్పుడు తరలి వస్తారు? అని విమర్శలు వినిపించేవి. ఇప్పుడు ఆయన విజయవాడ తరలివచ్చేసి అక్కడ పరిపాలనకు అవసరమయిన తాత్కాలిక వసతులను ఏర్పాటు చేసుకొంటుంటే, హైదరాబాద్ లో మరో 8సం.లు ఉండే అవకాశం ఉండగా తాత్కాలిక నిర్మాణాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం విచ్చల విడిగా ఖర్చు చేసేస్తున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శిస్తున్నారు.

ఏపి, తెలంగాణా రాష్ట్రాలకు మరొక 8సం.లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. దీనిని విభజన చట్టంలోనే పొందుపరిచారు కనుక చట్టప్రకారం ఈ విషయంలో ఎటువంటి వివాదానికి ఆస్కారం లేదు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటునప్పటికీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ చంద్రబాబు నాయుడు ఉంటే చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. మొన్న గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా “చంద్రబాబు నాయుడు వారానికో పది రోజులకో హైదరాబాద్ వచ్చి వెళ్ళవచ్చు గానీ ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చొంటానంటే కుదరదు” అన్నట్లు కేసీఆర్ మాట్లాడారు.

కేసీఆర్ ఏమనుకొన్నప్పటికీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు చూసుకోవడం, ప్రజలకు దూరంగా ఉండటం, ఆ కారణంగా తరచూ హైదరాబాద్-విజయవాడ మధ్య తిరగవలసి రావడం వంటి అనేక ఇబ్బందులున్నాయి. అదీగాక ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు బయటపడిన తరువాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండేందుకు ఇష్టపడకనే విజయవాడ తరలివచ్చేసారు. విజయవాడ నుండే పరిపాలన సాగించడం వలన అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చును. అదే ప్రజలకు, పాలకులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది కూడా.

రాజధాని నిర్మాణం జరిగి అందులో శాశ్విత భవనాలు సిద్దం అయ్యే వరకు ప్రభుత్వ కార్యాలయాల కోసం తాత్కాలిక వసతి సౌకర్యాలు అవసరమే. ఇప్పటికే వాటి కోసం కొన్ని భవన సముదాయాలను అధికారులు సిద్దం చేసారు. కానీ రూ.180 కోట్లతో తాత్కాలిక సచివాలయం నిర్మించాలనే తెదేపా ప్రభుత్వ ఆలోచననే అందరూ తప్పు పడుతున్నారు. విమర్శిస్తున్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం ముందుకే సాగుతుండటంతో బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి వంటి ప్రతిపక్ష నేతలు ఇంకా విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ప్రభుత్వం చెపుతున్నప్పుడు మళ్ళీ ఈ తాత్కాలిక కట్టడాల కోసం అంత డబ్బుని ఎందుకు దుబారా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం చేతిలో సిద్దంగా ఉంది కనుక ఆ ప్రకారమే శాశ్విత భవనం నిర్మించుకోవచ్చును కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుండి సరయిన సమాధానాలు ఇవ్వడం లేదు కనుక బొత్స వంటి వారు చేస్తున్న విమర్శలను ప్రభుత్వం భరించకతప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close