వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాటల్లో తడబడతారు కాబట్టి ఇలా ఉన్నారు కానీ లేకపోతే వైఎస్ కన్నా ముందే ముఖ్యమంత్రి అయ్యేవారని ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాకపోయినా ఈ రేంజ్ లో ఉన్నారంటే.. ఆయన రాజకీయ వ్యూహాలే కారణం అనుకుంటారు. ఇప్పుడు అలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు.
తనను అంతం చేయడానికి ప్రణాళికలు అమలు చేశారట. ఎందుకంటే ఇటీవల సిరిమాను ఉత్సవం జరిగింది. దానికి ఆయన తన కుటుంబంతో చూడటానికి ఓ చోట స్టేజ్ కట్టించుకున్నారు. దానిపై ఎక్కువ మంది కూర్చోవడంతో కుంగిపోయింది. అదే కారణంతో ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రతిపక్ష నేత అయిన తాను కూర్చున్న స్టేజ్ కుంగిపోయిందని ఇంత కంటే అవమానం ఉంటుందా అని ఫీలయ్యారు. ఈ ఘటన జరిగిపోయిన రెండు , మూడు రోజుల తర్వాత ఆయన స్పందించారు.
ఓ టీవీ చానల్ లో .. ఓ సీనియర్ నేతకు తీవ్ర అవమానం జరిగిందని పెద్ద కథనం రాయించుకున్న తర్వాతనే ఆయన ఈ పోరాటం ప్రారంభించారు. ఏకంగా తన ప్రాణానికి ముప్పు తెస్తున్నారని అంటున్నారు. బొత్స మాటలు విని పాపం.. అనుకుంటున్నారు వైసీపీ నేతలు. రాజకీయంలో వైల్డ్ పాటిక్స్ అంటాయని.. వాటిని బొత్స చేస్తే మాత్రం.. వింతగా ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు. బొత్స ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలని.. జగన్ నుంచి ఎలాంటి ముప్పు అయినా రావొచ్చని పల్లా శ్రీనివాస్ సలహా ఇచ్చారు.