అల్లు అరవింద్ తల్లి దశదిన కర్మలో నివాళి అర్పించేందుకు మాజీ మంత్రి బొత్స హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఆయన ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. రఘురామ, గంటా శ్రీనివాస్‌లతో కలిసి ఫోటోలు దిగారు. అల్లు అర్జున్ తో సరదాగా అందరూ మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మిగతా వారి సంగతేమో కానీ.. రాజకీయాలు అంటే వ్యక్తిగతంగా తీసుకునే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బొత్సకు మైనస్ మార్కులు వేయడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రఘురామకృష్ణరాజుతో బొత్స క్లోజ్ గా మెలగడం అంటే.. జగన్ తట్టుకోలేరని జగన్ గురించి తెలిసిన వారు ఓ అంచనాకు వస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత జగన్ ను రఘురామ ఇతర విషయాల్లో విమర్శించడం లేదు కానీ అసెంబ్లీకి రాకపోవడంపై మాత్రం.. గట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు. అనర్హతా వేటు ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు. సహజంగానే రఘురామ అంటే.. మండిపోయే జగన్ కు.. ఇప్పుడు ఆయన పక్కన తమ పార్టీ నేత బొత్సను చూసి కామ్ గా ఉండటం కష్టమే.
బొత్స వ్యవహారం వైసీపీలో కాస్త తేడాగానే ఉంది. ఆయన పరిస్థితుల్ని గమనిస్తూ ఇంట్లో ఉంటున్నారని.. అవసరైనప్పుడు.. ఓ ప్రెస్ మీట్ పెట్టి పైపైన కొన్ని విమర్శలు చేసి రాజకీయంగా ఎవరితో టచ్ లో ఉండాలో వారితో టచ్ లో ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇలా ఇతర వేడుకల్లో ఆయన టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నట్లుగా తెలిస్తే.. జగన్ మాత్రం.. ఆయనను మెల్లగా దూరం పెడతారు. తనకు శత్రువులు.. వైసీపీలో అందరికీ శత్రువులే అన్నది ఆయన భావన అని చెప్పాల్సిన పని లేదు.
