ఈ వారం సినిమాలు: బాలయ్యపైనే ఆశలు

గత మూడు వారాలుగా సరైన సినిమాలేక టాలీవుడ్ బాక్సాఫీసు డీలా పడింది. అయితే ఈ వారం ఆ లోటు తీరిపోయినట్లే కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలయ్య- బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్స్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇందులో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. అఘోరగా బాలకృష్ణ.. ట్రైలర్ లో స్టన్నింగ్ గా వున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. ‘అఖండ’విజయంతో పండక్కి బాలయ్య ఘనస్వాగతం పలుకుతారానే అంచనాలు వున్నాయి.

అఖండతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో వున్నాయి. సత్యదేవ్‌, నిత్యమేనన్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకుడు. ఈ సినిమా కూడా డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1979 నేపథ్యంలో సాగే చిత్రమిది. అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్‌ ఉపగ్రహం సాంకేతిక కారణాలతో భూమిపై పడతుందనే అనుమానాలు, దాని చుట్టూ హాస్యంతో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నిత్యా, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ లాంటి నటులు వుండటం సినిమాపై పాజిటివిటీని పెంచుతుంది. స్కైలాబ్‌ తో పాటు పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్యాక్‌ డోర్‌’ సినిమా కూడా డిసెంబరు 3 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ లో కూడా పూర్ణ తప్ప మరెవరూ కనిపించలేదు.

ఈ రెండితో పాటు ఒక డబ్బింగ్ సినిమా కూడా విడుదలకు సిద్దమైయింది. మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని 2020లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనాతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఎట్టకేలకు డిసెంబరు 3న థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. మోహన్ లాల్ తో పాటు కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌ లాంటి భారీ తారాగణం వుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ చూస్తుంటే థియేటర్ ఎక్స్ పిరియన్స్ వున్న సినిమాగా అనిపిస్తుంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో భారీ అంచనాలతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా మాత్రం బాలయ్య అఖండనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైష్ణ‌వ్ తేజ్‌… ‘రంగ రంగ వైభ‌వంగ‌…!’

ఉప్పెన‌తో ఎంట్రీ ఇచ్చిన మ‌రో మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `కొండపొలెం` నిరాశ ప‌రిచినా, ఆ ఎఫెక్ట్ వైష్ణ‌వ్ కెరీర్‌పై ప‌డ‌లేదు....

టీడీపీ హయాంలో జరగలేదా ? “కేసినో”పై ఇదే వైసీపీ ఎదురుదాడి !

కొడాలి నాని గుడివాడలో కేసినో నిర్వహించి అడ్డంగా దొరికిపోయారు. ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటి వెల్లువగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ అంశంపై వైసీపీ తన విధానాన్ని ప్రకటించాల్సిన సమయంలో.. అడ్డగోలుగా...

పీకల మీదకు తెచ్చేశాక సజ్జల మాట్లాడరెందుకు !?

ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఇంతకు ముందు వరకూ ప్రతి విషయాన్ని మీడియాతో చెప్పే బాధ్యత తీసుకునేవారు. చంద్రబాబుకు కౌంటర్ఇచ్చే బాధ్యత కూడా ఆయనే...

తగ్గింపుతోనే జీతాలు.. కొత్త జీవో రిలీజ్ !

ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై ఉద్యోగుల్ని నచ్చ చెప్పేందుకు కమిటీ వేశామని చెబుతోంది చెబుతున్నా..తమ నిర్ణయాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేబినెట్ భేటీలో పీఆర్సీకి ఆమోద ముద్ర వేసేసి.. కొత్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close