అత్యంత విష‌మంగా సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈరోజు ఆయ‌న‌కు ఓ కీల‌క‌మైన ఆప‌రేష‌న్ జ‌ర‌గాల్సివుంది. అయితే… ఆ ఆప‌రేష‌న్ ని ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన వైద్యులు ఆప‌రేష‌న్ వాయిదా వేసిన‌ట్టు స‌మాచారం. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌, శ్వాస కోశ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు సీతారామ‌శాస్త్రి. ఆయ‌న‌కు అత‌స్య‌వ‌స‌ర‌మైన, ఆధునిక‌మైన‌ వైద్యం అందించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంద‌ని తెలుస్తోంది. సీతారామ‌శాస్త్రి ని ప‌రామ‌ర్శించ‌డానికి ప్ర‌ముఖులు ఆసుప‌త్రికి వెళ్దామ‌న్నా, కుటుంబ స‌భ్యులు, వైద్యులు వారిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏ క్ష‌ణంలో ఎలాంటి దుర్వార్త వినాల్సివ‌స్తుందో అని ఆయ‌న అభిమానులు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఆయ‌న క్షేమంగా రావాల‌ని కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైష్ణ‌వ్ తేజ్‌… ‘రంగ రంగ వైభ‌వంగ‌…!’

ఉప్పెన‌తో ఎంట్రీ ఇచ్చిన మ‌రో మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `కొండపొలెం` నిరాశ ప‌రిచినా, ఆ ఎఫెక్ట్ వైష్ణ‌వ్ కెరీర్‌పై ప‌డ‌లేదు....

టీడీపీ హయాంలో జరగలేదా ? “కేసినో”పై ఇదే వైసీపీ ఎదురుదాడి !

కొడాలి నాని గుడివాడలో కేసినో నిర్వహించి అడ్డంగా దొరికిపోయారు. ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటి వెల్లువగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ అంశంపై వైసీపీ తన విధానాన్ని ప్రకటించాల్సిన సమయంలో.. అడ్డగోలుగా...

పీకల మీదకు తెచ్చేశాక సజ్జల మాట్లాడరెందుకు !?

ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఇంతకు ముందు వరకూ ప్రతి విషయాన్ని మీడియాతో చెప్పే బాధ్యత తీసుకునేవారు. చంద్రబాబుకు కౌంటర్ఇచ్చే బాధ్యత కూడా ఆయనే...

తగ్గింపుతోనే జీతాలు.. కొత్త జీవో రిలీజ్ !

ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై ఉద్యోగుల్ని నచ్చ చెప్పేందుకు కమిటీ వేశామని చెబుతోంది చెబుతున్నా..తమ నిర్ణయాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేబినెట్ భేటీలో పీఆర్సీకి ఆమోద ముద్ర వేసేసి.. కొత్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close