సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల సిరివెన్నెల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం తుది శ్వాశ విడిచారు. సిరివెన్నెల మరణ వార్త యావత్ సినీ ప్రపంచాన్ని కలచి వేసింది. నిన్న సాయంత్రం కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారని, ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. ఇంతలోనే సిరివెన్నెల ఇక లేరనే వార్త అందరినీ దిగ్బ్రాంతిని గురి చేసింది.

సీతారామశాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అయితే సమస్య ప్రాణంతంకంగా వుందనే విషయాన్ని ఎవరూ ఉహించలేదు. ఇటివలే విడుదలైన క్రిష్ ‘కొండపొలం’ సినిమా కోసం రెండు పాటల్ని రాశారు సిరివెన్నల. ఏదో చిన్న అనారోగ్యం మళ్ళీ తిరిగి వచ్చేస్తారనే అందరూ సన్నిహితులు, అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావడం అందరినీ కలిచివేసింది. సిరివెన్నెల లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. సిరివెన్నెల మరణం.. ఆయన పాటని ప్రేమించిన అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close