ఈవారం బాక్సాఫీస్‌: హార‌ర్‌…. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. ఓ ల‌వ్ స్టోరీ

ఈవారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర చిన్న సినిమాలు ఢీ కొట్ట‌బోతున్నాయి. అందులో ఒక‌టి హార‌ర్ కామెడీ అయితే.. మ‌రోటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. మూడోది ప్రేమ‌క‌థ‌.

రాజుగారి గ‌దితో హిట్టు కొట్టిన ఓంకార్ ‘రాజుగారి గ‌ది 3’ తీశాడు. ఈసారి భ‌య‌పెట్టే బాధ్య‌త‌ని అవికా గోర్‌పై వేశాడు. అవికా తెలుగు సినిమాల‌కు దూర‌మై చాలా రోజులైంది. త‌మ‌న్నా చేయాల్సిన పాత్ర‌ని అవికాకి ఇచ్చి – షాక్ ఇచ్చాడు ఓంకార్‌. త‌న త‌మ్ముడు అశ్విన్ బాబుని హీరోగా ప్ర‌మోట్ చేయ‌డానికి ఈ సినిమా చేస్తున్నాన‌ని కూడా చెప్పాడు. ట్రైల‌ర్లు ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి. హార‌ర్‌, కామెడీ ఎలిమెంట్స్ వ‌ర్క‌వుట్ అయితే… ఓంకార్ ఖాతాలో మ‌రో హిట్టు ప‌డుతుంది. టెక్నిక‌ల్‌గా పేరొందిన వాళ్ల‌ని తీసుకోవ‌డం ఓంకార్ కి ప్ల‌స్‌. పైగా… మంచి కామెడీ గ్యాంగ్ ఉంది. రాజుగారి గ‌ది ఇది వ‌ర‌క‌టి సినిమాలు బాగా ఆడ‌డంతో.. ప్రేక్ష‌కులు ఈ సినిమాపై ఫోక‌స్ పెడ‌తారు. దానికి తోడు ప్ర‌మోష‌న్లు కూడా బాగానే చేశారు.

ఈ సినిమాతో పోటీ ప‌డుతున్న ఆది సాయికుమార్ చిత్రం ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’. సాయికిర‌ణ్ అడ‌వి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. కశ్మీరీ పండిట్స్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఉగ్ర‌వాదం, యాక్ష‌న్‌.. ఇవ‌న్నీ మేళ‌వించారు. ర‌చ‌యిత అబ్బూరి ర‌వి ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌డం విశేషం. ఈ సినిమాకి పని చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన ల‌భాల్ని మాత్రం అంతా క‌లిసి పంచుకుంటారు. ప్లాన్ బాగానే ఉంది.. కానీ ప్ర‌మోష‌న్లు మాత్రం బాగా వీక్‌గా ఉన్నాయి. అస‌లు ఈ సినిమా ఒక‌టొస్తుంద‌న్న విష‌య‌మే జ‌నాల‌కు తెలియ‌డం లేదు. అంతా గ‌ప్ చుప్ వ్య‌వ‌హారాలే. క‌నీసం ఆది సాయికుమార్ కూడా మీడియా ముందుకు రాలేదు. తెర వెనుక ఏం జ‌రిగిందో మ‌రి.

ఈ రెండు సినిమాల‌తో మ‌రో చిన్న సినిమా ‘మ‌ళ్లీ మ‌ళ్లీ చూశా’ పోటీ ప‌డుతోంది. ఇదో ల‌వ్ స్టోరీ. అనురాగ్, శ్వేత జంట‌గా న‌టించారు. హేమంత్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌చార చిత్రాలు ప్రామిసింగ్‌గానే ఉన్నాయి. ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత మేట‌రుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టం. విడుద‌ల‌య్యాక స‌త్తా ఉంటే నిల‌బ‌డిపోతుంటాయి. మ‌రి.. మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేలా ఈ సినిమాలో ఏముందో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close