తొక్కిసలాట ఘటనలో ‘బోయపాటి’ కోణం

హైదరాబాద్: రాజమండ్రి తొక్కిసలాట దుర్ఘటనలో నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ గురించి నిన్న, మొన్న గొడవ జరిగాక ఇవాళ కొత్త కోణం వెలుగులోకొచ్చింది. బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను తీసిన బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై డాక్యుమెంటరీ తీస్తుండటంవల్లే ఈ దుర్ఘటన జరిగిందని కాంగ్రెస్, వైసీపీ ఇవాళ ఆరోపణలు ప్రారంభించాయి. పుష్కరాలలో చంద్రబాబు స్నానాలు, పూజల దృశ్యాలను బోయపాటితో షూటింగ్ చేయిస్తున్నారని, అందుకే మూడుగంటల సమయం పట్టిందని ఏపీ పీసీీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. దీనివలనే దుర్ఘటన జరిగిందని, చంద్రబాబుపై 302 సెక్షన్ కింద కేసుపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీకూడా ఇదే వాదనను అందిపుచ్చుకుని టీడీపీపై దాడిని ప్రారంభం చేసింది. పుష్కరాలపై బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబుపై డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిపారని, అందువల్లే దుర్ఘటన జరిగిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.

బోయపాటి రాజమండ్రిలో చంద్రబాబువెంట ఉన్నది మాత్రం నిజం. చంద్రబాబు పక్కనే ఉండి మైక్‌లో సూచనలు ఇస్తున్న బోయపాటి ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో రౌండ్‌లు కొడుతోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ ఫోటో రాత్రి సమయంలో తీసినట్లు స్పష్టంగా కనబడుతోంది. దుర్ఘటన జరిగింది ఉదయం అన్నది అందరికీ తెలిసిన విషయమే. జరిగిందేమిటంటే, వారణాసిలో కుంభమేళా సందర్భంగా గంగా నదివద్ద ఇచ్చే హారతి స్థాయిలోనే రాజమండ్రిలో గోదావరికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని జరపాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు. మొదటిరోజు నిర్వహించిన పుష్కర నిత్యహారతికి అనుకున్నంత స్పందన రాకపోవటంతో దీనిని మెరుగుపరిచే బాధ్యతను బాబు బోయపాటికి అప్పగించారు. బోయపాటి రెండువంతెనల నడుమ ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ పంటుమీద ఒక వేదికను ఏర్పాటుచేసి గుంటూరుకు చెందిన కళాదర్శకులతో వేదికను నిర్మింపజేశారు. అక్కడ ఈనెల 13నుంచి నిత్యహారతి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఆ ఏర్పాట్ల ఫోటోయే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. అంతేగానీ బోయపాటి ఏ విధమైన డాక్యుమెంటరీ తీయలేదని స్థానికులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close