మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకి ముందు నుయ్యి వెనక గొయ్యి

హైదరాబాద్ లో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్ డాటాని తమకు అందించాలని కోరుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ వారిని ఆ వివరాలు కోర్టులో సమర్పించాలని ఇంతకు ముందు ఆదేశించింది. కానీ కాల్ డాటాను ఎవరికీ ఇవ్వవద్దని మెమో ఫెయిల్ చేసిందని, ఒకవేళ తన ఆదేశాలను ధిక్కరించి కాల్ డాటాను ఎవరికయినా ఇచ్చినట్లయితే ప్రాసిక్యూట్ చేస్తామని తమను హెచ్చరించినట్లు సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకి తెలియజేసారు.

కానీ కోర్టు ఆదేశించినప్పటికీ వారు కాల్ డాటాని ఇవ్వడానికి నిరాకరించడం కోర్టు ధిక్కారంగానే పరిగణించాలని, ఐపిసి సెక్షన్ 174 ప్రకారం అది నేరమని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ వాదించారు. రెండు నెలల తరువాత కాల్ డాటా చెరిగిపోతుంటుంది కనుక తాము కోరిన కాల్ డాటాను సర్వీస్ ప్రొవైడర్లు విధిగా భద్రపరిచి తమకు అప్పగించాలని ఆయన కోరారు. సర్వీస్ ప్రొవైడర్ల తరపున వాదించిన న్యాయవాదులు కాల్ డాటా ఇచ్చే విషయమై ఆలోచించుకోవడానికి తమకి రెండు వారాలు సమయం కావాలని కోరారు. అందుకు సమ్మతించిన కోర్టు ఈనెల 24వ తేదీలోగా ఆ కాల్ డాటాను సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని ఆదేశించింది. అంతవరకు సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డాటాను చెరిగిపోకుండా భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అప్పటికీ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డాటా ఇవ్వకపోయినట్లయితే వారిపై తదుపరి చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ కోర్టుని అభ్యర్ధించారు. ఈ కేసును కోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ ఒకదానినొకటి దెబ్బ తీసుకొనేందుకు లేదా ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడేందుకే ఈ ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను కొనసాగిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఓటుకి నోటు కేసులో తెదేపా అడ్డంగా దొరికిపోయింది. అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేదా ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసినందునే తెరాస ప్రభుత్వం ఫోన్ కాల్స్ డాటా ఇవ్వడానికి వీలు లేదని సర్వీస్ ప్రొవైడర్లును ఆదేశించినట్లు అనుమానించవలసి వస్తోంది. లేకుంటే వారిని ఆవిధంగా ఆదేశించనవసరమే లేదు. ఒకవేళ వారు కాల్ డాటాను ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులకి అప్పగిస్తే తెరాస పిలక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలోచిక్కుతుంది. అందుకే ఆ కాల్ డాటా కోసం సిట్ అధికారులు పట్టుబడుతున్నారని భావించవచ్చును.

ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్లు ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులకి కాల్ డాటాని ఇస్తే తెలంగాణా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది కనుక వారిని అడ్డుకొనెందుకు శతవిధాల ప్రయత్నించవచ్చును. అయినప్పటికీ వాళ్ళు తన ఆదేశాలను ధిక్కరించి కాల్ డాటాని సిట్ అధికారులకి అందిస్తే తెలంగాణా ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చును. ఒకవేళ వారు కాల్ డాటా ఇవ్వకపోతే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఓటుకి నోటు కేసు నుండి తనని తాను రక్షించుకొనేందుకు మార్గాలు మూసుకుపోతాయి. కనుక అప్పుడు అది వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చును. రెండు ప్రభుత్వాలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో సర్వీస్ ప్రొవైడర్లు బలయిపోయేలా ఉన్నారు.

తెదేపా, తెరాసలకు ప్రజలు అధికారం కట్టబెట్టి రాష్ట్రాన్ని పరిపాలించమని కోరితే అవి ఈవిధంగా రాజకీయ క్రీడలలో మునిగితేలుతున్నాయి. పైగా ప్రజల గోళ్ళూడగొట్టి మరీ వసూలు చేస్తున్న పన్నులతో అధికారులకు జీతాలు చెల్లిస్తూ వారిని ప్రజల కోసం కాకుండా ఇటువంటి పనులకు నిసిగ్గుగా వాడుకొంటున్నాయి. ప్రజల కోసం పనిచేయవలసిన పోలీసు, సిఐడి, ఎసిబి, న్యాయవ్యవస్థలను ఈవిధంగా దుర్వినియోగం చేయడం చాలా శోచనీయం. కానీ ఇటువంటి తప్పులను ప్రశ్నించాల్సిన మేధావులు కూడా మౌనం వహించడం దురదృష్టకరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌ను తక్కువ అంచనా వేస్తే ఇంతే !

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సార్లు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు, మూడు చోట్ల గెలవడానికి తంటాలు పడింది. ...

వైసీపీ ట్రబుల్ షూటర్ విడదల రజనీ

ప్రతి పార్టీకి ఓ ట్రబుల్ షూటర్ ఉంటారు. పార్టీలో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఆ ట్రబుల్ షూటర్ చేసే ప్రయత్నాలు పార్టీని చాలా వరకూ గాడిలో పెడతాయి. వైసీపీలో ఇప్పుడా ట్రబుల్...

అధ్యక్ష పదవి కావాలా…బిగ్ టాస్క్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్!

తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు ఈటల, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ తోపాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నారు....

డ్రైవర్ లేని బీఆర్ఎస్ కారు – ఎటు పోతోంది ?

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నారు. కవిత ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. కేటీఆర్ తీరు చూస్తూంటే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. డ్రైవర్లు అంతా ఇలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close