ఓ హీరోయిన్‌ని `క‌ట్‌` చేసిన బోయ‌పాటి

బాల‌కృష్ణ సినిమా అంటే ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే. లేదంటే అభిమానుల‌కు సైతం ఏదో వెలితిగా ఉంటుంది. బాల‌య్య సోలో హీరోగా వ‌చ్చినప్పుడే జోడు భామ‌ల‌తో ఆడిపాడేవాడు. ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌ను సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. కాబ‌ట్టి.. క‌థానాయిక‌ల గ్యాంగ్ ఎక్కువ‌గానే ఉండే అవ‌కాశాలున్నాయ‌ని అనుకున్నారు. బోయ‌పాటి సినిమాలో… ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌న్న ప్ర‌చారం బాగా జ‌రిగింది. ఓ క‌థానాయిక‌గా అంజ‌లిని ఎంచుకున్నార‌ని, రెండో పాత్ర కోసం శ్రియ‌, త్రిష‌ల పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పుకున్నారు.

కానీ.. ఇప్పుడు బోయ‌పాటి సింగిల్ హీరోయిన్‌తోనే ప‌రిమితం అయ్యాడు. అంజ‌లి త‌ప్ప ఈ సినిమ‌లో మ‌రో క‌థానాయిక లేద‌న్న క్లారిటీ వ‌చ్చేసింది. నిజానికి ఈ సినిమాలోనూ ఇద్ద‌రు హీరోయిన్ల‌ను తీసుకోవాల‌నుకున్నారు. కానీ బ‌డ్జెట్‌ని త‌గ్గించ‌డంలో భాగంగా అంజ‌లితోనే ప‌రిమిత‌మైంది చిత్ర‌బృందం. మ‌రో క‌థానాయిక పాత్ర స్క్రిప్టు ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టికీ – ఇప్పుడు ఆ పాత్ర‌ని తొల‌గించార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం 70 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. బాల‌య్య – బోయపాటి సినిమా అంటే క్రేజ్ ఉన్న మాట నిజ‌మే గానీ, 70 కోట్ల బ‌డ్జెట్ అంటే రిస్కే. ఆ గీత దాట‌కుండా చూసుకోవ‌డం చాలా ముఖ్యం కూడా. అందుకే అన‌వ‌స‌ర‌మైన పాత్ర‌ల్ని దూరం పెడుతున్నాడు బోయపాటి. అందులో భాగంగానే.. ఓ హీరోయిన్ క‌ట్ట‌య్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com