మ‌రో హీరోని విల‌న్ చేసిన బోయ‌పాటి

బోయ‌పాటి స్ట్రాట‌జీలు కాస్త భిన్నంగా ఉంటాయి. అప్ప‌టి వ‌ర‌కూ లేని ఇమేజ్‌ని త‌న సినిమాతో.. తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు బోయ‌పాటి. లెజెండ్ లో బాల‌కృష్ణ‌, అఖండ‌లో శ్రీ‌కాంత్‌ల ఇమేజ్‌ల‌ను పూర్తిగా మార్చేశారాయ‌న‌. ఇప్పుడు రామ్ సినిమాకీ ఇదే స్ట్రాట‌జీ ఫాలో అవుతున్నారు.

రామ్ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో… ప్రిన్స్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చిన్న సినిమాల్లో హీరోగా మెరిశాడు ప్రిన్స్‌. టాలెంట్ ఉంది కానీ, ఇప్ప‌టికీ స‌రైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు రామ్ సినిమాలో త‌ను ఓ కీ రోల్ చేస్తున్నాడు. ఇందులో ప్రిన్స్ గెట‌ప్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌ని ఓ రేంజ్‌లో మార్చేశాడ‌ట బోయ‌పాటి. ప్రిన్స్ ని తెర‌పై చూస్తే ఒళ్లు గ‌గుర్పాటుకి గుర‌య్యేలా ఆ పాత్ర‌ని డిజైన్ చేశాడ‌ట‌. ఈ సినిమా గ‌నుక హిట్ట‌యితే… ఇండ‌స్ట్రీకి మ‌రో విల‌న్ దొరికేసిన‌ట్టే అని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి… ప్రిన్స్‌కి ఈ సినిమాతో ఎలాంటి బ్రేక్ వ‌స్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close