‘రైట‌ర్‌’ గారు చాలా చీప్‌

సుహాస్ హీరోగా న‌టించిన ‘క‌ల‌ర్ ఫొటో’కి మంచి పేరొచ్చింది. అయితే అది థియేట‌ర్లో రాలేదు. ఓటీటీకి ప‌రిమిత‌మైంది. తొలిసారి సుహాస్ త‌న అదృష్టాన్ని థియేట‌ర్ల‌లో ప‌రీక్షించుకోబోతున్నాడు. ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ సినిమాతో. ఈ సినిమా విష‌యంలో నిర్మాత‌లు ఓ తెలివైన ప‌ని చేశారు. టికెట్ రేట్ల‌ని బాగా త‌గ్గించేశారు. సింగిల్ స్క్రీన్‌లో ఈ సినిమా కేవ‌లం రూ.110 మాత్ర‌మే. మ‌ల్టీప్లెక్స్‌లో అయితే రూ.150. ఈ ధ‌ర‌లు జీఎస్టీల‌తో క‌లిపి లెక్కేసుకోవాలి. కేవ‌లం కుటుంబం అంతా క‌లిసి థియేట‌ర్ల‌కు రావాల‌నే ఆలోచ‌న‌తో… టికెట్ రేట్ల‌ని బాగా త‌గ్గించారు.

ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, భీమ‌వ‌రం, గుంటూరు, కాకినాడ‌లో ప్ర‌దర్శించారు. వాటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 2న హైద‌రాబాద్‌లో ప్రీమియ‌ర్ షోలు ప‌డ‌బోతున్నాయి. ప్రీమియ‌ర్ షోల‌తో వ‌చ్చిన బూస్ట‌ప్‌, టీజ‌ర్‌- ట్రైల‌ర్‌లు ఇచ్చిన న‌మ్మ‌కంతో.. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఖుషీగా ఉన్నారు. ఓ చిన్న సినిమాకి విడుద‌ల‌కు ముందే ఇన్ని ప్రీమియ‌ర్లు ప‌డ‌డం ఇదే తొలిసారి. మ‌రి.. సుహాస్‌కి ఈసారి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముఖ ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close