చిరుపై ఆశ‌లు వ‌దులుకోని బోయ‌పాటి

టాలీవుడ్ స్టార్ ‌డైరెక్ట‌ర్ల‌లో బోయ‌పాటి శ్రీ‌ను ఒక‌డు. బ‌డా స్టార్లూ, పెద్ద పెద్ద బ‌డ్జెట్లూ, పెద్ద స్పాన్ ఉన్న క‌థ‌లూ.. బోయ‌పాటి స్టైల్‌. బోయ‌పాటితో సినిమా అంటే హీరోలంతా రెడీనే. అయితే.. ఇప్పుడు బోయ‌పాటి దృష్టి చిరంజీవిపై ఉంది. చిరు – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల్సింది. ఈ కాంబినేష‌న్‌లో సినిమా చేస్తాన‌ని ఒక‌ప్పుడు అల్లు అర‌వింద్ కూడా ప్ర‌క‌టించారు. `సైరా` త‌ర‌వాత‌… ఈసినిమానే అనుకున్నారు.

కానీ.. ప‌రిస్థితులు మారిపోయాయి. `సైరా` చేస్తున్న‌ప్పుడే కొర‌టాల శివ ట‌చ్‌లోకి రావ‌డం, కొర‌టాల ట్రాక్ రికార్డు బోయ‌పాటి కంటే బాగుండ‌డంతో… బోయ‌పాటి నుంచి కొర‌టాల‌కు షిఫ్ట్ అయిపోయాడు చిరు. ఆ త‌ర‌వాత కూడా చిరు చాలా ప్రాజెక్టులు ఒప్పుకున్నా, అందులో బోయ‌పాటి సినిమా లేదు. బోయ‌పాటి కూడా… బాల‌కృష్ణ ప్రాజెక్టుపై ఫోక‌స్ పెట్టాడు. ఆ త‌ర‌వాత‌.. దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే చిరుపై మాత్రం ఆశ‌లు వ‌దులుకోలేదు. చిరుతో ఓసినిమా చేయాల‌ని ప్లాన్ వేస్తున్నాడు. ఇది వ‌ర‌కే చిరుకి ఓ లైన్ వినిపించాడు బోయ‌పాటి. దాంతోనే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేద్దామ‌నుకున్నారు. ఇప్పుడు ఆలైన్ పై కూడా బోయ‌పాటి వ‌ర్క్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. చిరు కాంపౌండ్ నుంచి ఎప్ప‌టికైనా త‌న‌కు పిలుపు రావొచ్చ‌ని, అప్ప‌టికి క‌థ‌తో సిద్ధంగా ఉండాల‌న్న‌ది బోయ‌పాటి వ్యూహం. అదీ క‌రెక్టే. ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఎప్పుడు అవ‌కాశం వ‌స్తుందో చెప్ప‌లేం. చిరుకి అర్జెంటుగా ఓ మాస్‌క‌మ‌ర్షియ‌ల్ సినిమా కావాల్సివ‌స్తే… బోయ‌పాటి కి మించిన ఆప్ష‌న్ ఉండ‌దు. అందుకే బోయ‌పాటి త‌న‌ని తాను స‌ర్వ స‌న్న‌ద్ధం చేసుకుంటున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close