కూల్చివేతల్లో ఇక గీతం వంతు..!

విశాఖలో కూల్చివేతల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. వైజాగ్‌లో ఎక్కడా ఆక్రమణలే లేనట్లుగా ఒక్క టీడీపీకి చెందిన నేతలు.. సానుభూతిపరులే ఆక్రణలకు పాల్పడినట్లుగా.. తెల్లవారుజామునే… విరుచుకుపడుతున్నారు విశాఖ కార్పొరేషన్ సిబ్బంది. నోటీసులు .. సమయం ఇవ్వడాలు లాంటివి ఏమీ లేకుండా.. ఎప్పుడో గోడలకు అంటించేశామని చెప్పుకుని.. ఉదయమే.. బుల్డోజర్లతో వచ్చి కూల్చివేతలు చేస్తున్నారు. గీతం వర్శిటీకి చెందిన ప్రధానగేటు.. సెక్యూరిటీగదితో పాటు.. మరికొన్ని నిర్మాణానలను వీఎంసీ అధికారులు తెల్లవారుజామునే కూల్చేశారు. కనీసం వర్శిటీకి సంబంధిచి సిబ్బంది వచ్చేదాకా కూడా ఉండలేదు.

గీతం వర్శిటీకి వెళ్లే్ దారులను మొత్తం పూర్తిగా నిర్బంధించేశారు. విషయం తెలిసి.. అక్కడకు వెళ్లాలనుకున్న వర్శిటీ ఉన్నత ఉద్యోగులను కూడా అనుమతించలేదు. పూర్తిగా కూల్చివేసిన తర్వాతే.. వారిని ప్రదేశానికి అనుమతించారు. ఎలాంటి సమాచారం లేకుండా.. ప్రభుత్వం ఇలా విధ్వంసానికి పాల్పడటం అన్యాయమని వర్శిటీ వర్గాలు చెబుతున్నాయి. వివాదం కోర్టులో ఉండాగానే ఇలా కూల్చివేతలు చేయడంపై వర్శిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. హుదూద్ సమయంలో.. కరోనా సమయంలో వర్శిటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఉన్నత విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఇలా దూకుడుగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

గీతం వర్శిటీకీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన.. భరత్‌ కుటుంబానికి చెందినది. ఆయన ఎంవీవీఎస్ మూర్తి మనవడు. కొద్ది రోజుగా.. గీతం వర్శిటీని టార్గెట్ చేసి వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 40 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందని.. వర్శిటీ చెబుతోంది. ఏదైనా కానీ.. విశాఖకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన గీతం వర్శిటీలో కూల్చివేతలు.. విద్యార్థులు.. పూర్వ విద్యార్థులను మనస్థాపానికి గురి చేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close