‘మిస్ ఇండియా’ ట్రైల‌ర్‌: ఇది పేరు కాదు బ్రాండ్‌

మ‌హాన‌టి త‌ర‌వాత‌… లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కీర్తి సురేష్ రూపంలో మ‌రో ప్ర‌త్యామ్నాయం దొరికిన‌ట్టైంది. ఆ త‌ర‌హా క‌థ‌లు కీర్తిని చుట్టుముట్టాయి. అలాంటివాటిలో `మిస్ ఇండియా` ఒక‌టి. ఎంబీఏ చ‌దివి, మంచి వ్యాపార వేత్త కావాల‌నుకున్న అమ్మాయి క‌థ ఇది. ఆ ప్ర‌యాణంలో ఆమెకు ఎదురైన అనుభ‌వాలేంట‌న్న‌ది క‌థ‌. బిజినెస్ టైకూన్‌ల‌ను ఎదుర్కొని ఎలా నిల‌బ‌డ‌గ‌లిగిందీ… త‌న పేరుని ఓ బ్రాండ్ గా చేసుకోగిగింది? అన్న‌ది తెర‌పై చూడాలి. కీర్తి స్టైల్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌ని చూస్తుంటే – త‌న‌కు స‌రికొత్త పాత్ర దొరికింద‌నే చెప్పాలి. జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్ చంద్ర‌లాంటి వాళ్లు అద‌న‌పు బ‌లం అనుకోవొచ్చు. త‌మ‌న్ ఇచ్చిన ఆర్‌.ఆర్‌, విజువ‌ల్స్ తో ఈ సినిమా లుక్ మారిపోయింది. వ‌చ్చే నెల 4న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య కీర్తి న‌టించిన `పెంగ్విన్‌` ఓటీటీలోనే విడుద‌లైంది. కానీ.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ బాకీని.. `మిస్ ఇండియా` తీర్చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.