బాలయ్య మాట విన‌ని బోయ‌పాటి

ఫ్లాపుల్లో ఉన్న ఏ ద‌ర్శ‌కుడైనా స‌రే, హీరోలు.. నిర్మాత‌ల మాట వినాల్సిందే. ఎందుకంటే టైమ్ అలాంటిది. కానీ బోయ‌పాటి శ్రీ‌ను మాత్రం `నేను ఎవ‌రి మాటా విన‌ను` అంటూ సీత‌య్య అవ‌తారం ఎత్తాడు. `విన‌య విధేయ‌రామా` ఫ్లాపుతో ప‌ది అడుగులు వెన‌క్కి వేశాడు బోయ‌పాటి శ్రీ‌ను. ఈసారి శీన‌య్య కాస్త త‌గ్గుతాడేమో అనుకున్నారంతా. కానీ శీను మాత్రం ఇది వ‌ర‌క‌టిలానే మొండిగానే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు టాక్‌.

ఈ సినిమా కోసం 70 కోట్ల బ‌డ్జెట్ అనుకున్న‌ప్పుడు నిర్మాత స‌సేమీరా అన్నాడు. కానీ బోయ‌పాటి మాత్రం త‌గ్గ‌లేదు. తానెంత బ‌డ్జెట్ అనుకున్నాడో, అంతే బ‌డ్జెట్‌తో ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. బాల‌య్య మాట‌ల్ని కూడా బోయ‌పాటి పెడ చెవిన పెడుతున్నాడ‌ని టాక్‌. ముఖ్యంగా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల విష‌యంలో బోయ‌పాటి త‌న ఆలోచ‌న‌ల‌ను త‌గిన టీమ్‌నే ఎంచుకుంటున్నాడ‌ట‌. ఆఖ‌రికి బాల‌య్య వ్య‌క్తిగ‌త సిబ్బంది (ఉదాహ‌ర‌ణ‌కు కాస్ట్యూమ్స్‌, మేక‌ప్‌) విష‌యంలోనూ బోయ‌పాటి జోక్యం చేసుకుని. త‌న‌కు అనువైన వాళ్ల‌నే తీసుకొచ్చి పెట్టాడ‌ట‌. ఇది బాల‌య్య‌కు న‌చ్చ‌క‌పోయినా, బోయ‌పాటి పై ఉన్న గౌర‌వం, న‌మ్మ‌కంతో ‘స‌రే…’ అంటున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేయ‌డం బాల‌కృష్ణ స్టైల్‌. కాక‌పోతే.. త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది విష‌యంలో బాల‌య్య ఎవ‌రి మాటా విన‌డు. కానీ ఈసారి బోయ‌పాటి మాట వినాల్సివ‌స్తోంది. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల్లో బాల‌య్య కాస్ట్యూమ్స్‌, గెట‌ప్స్‌, హెయిర్ స్టైల్ అన్నీ బాగా కుదిరాయి. ఆ న‌మ్మ‌కంతోనే… బోయ‌పాటికి బాల‌య్య ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com