య‌థా బోయ‌పాటి.. త‌థా అర్జున్ జంథ్యాల‌

ఎందుకోగానీ… ఇప్పుడున్న పెద్ద ద‌ర్శ‌కుల నుంచి పెద్ద‌గా శిష్య‌గ‌ణం రావ‌డం లేదు. వినాయ‌క్‌, రాజ‌మౌళి, పూరి శిష్యులుగా చెప్పుకుని వెలుగొందిన వాళ్లు ఒక్క‌రూ లేరు. ఎవ‌రి ద‌గ్గ‌రా ప‌నిచేయ‌కుండా, సినిమాలు తీసే ద‌ర్శ‌కుల సంఖ్య ఎక్కువైపోవ‌డ‌మే అందుకు కార‌ణం కావొచ్చు. ఇప్పుడు బోయ‌పాటి నుంచి ఓ శిష్యుడు వ‌చ్చాడు. త‌నే అర్జున్ జంథ్యాల‌. `గుణ 369` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మెగాఫోన్ ప‌ట్టాడు. ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయ న‌టించిన సినిమా ఇది. బోయ‌పాటిది యాక్ష‌న్ శైలి. ప్రేమ క‌థ ఎంచుకున్నా, ఫ్యామిలీ ఎమోషన్ ప‌ట్టుకున్నాఆ క‌థ‌ని యాక్ష‌న్ వైపుకు లాక్కెళ్లిపోతాడు. ఇప్పుడు శిష్యుడు అర్జున్ జంథ్యాల కూడా అదే చేశాడు. `గుణ 369` ట్రైల‌ర్ చూస్తుంటే యాక్ష‌న్ డోసు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. కెమిస్ట్రీ సూత్రాల‌కు విరుద్ధంగా విల‌న్లు గాల్లో లేవ‌డాలు, భూమ్మీద ప‌డి గింగిరాలు తిర‌గ‌డాలు, కొడితే గోడ‌లు బ‌ద్ద‌లైపోవ‌డాలూ.. ఇవ‌న్నీ గుణ 369 ట్రైల‌ర్‌లోనూ క‌నిపిస్తున్నాయి. యువ హీరోలు ప్రేమ క‌థ‌లు, కొత్త త‌ర‌హా కాన్సెప్టులు ఎంచుకుంటే.. కార్తికేయ మాత్రం ప‌క్కా యాక్ష‌న్ క‌థ‌వైపు ప‌రుగులు పెడుతున్నాడు. తొలి సినిమాకే అర్జున్ జంథ్యాల ఈ రేంజులో యాక్ష‌న్ చూపించాడంటే మున్ముందు ఇంకెంత చేస్తాడో..? ఆగ‌స్టు 2న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. `ఆర్‌.ఎక్స్ 100`తో వ‌చ్చిన క్రేజ్‌ని హిప్పీతో పాడు చేసుకున్న కార్తికేయ.. ముచ్చ‌ట‌గా మూడో సినిమాకి ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం...

లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో...

ఆర్ఆర్ఆర్‌పై ఎలా వేటేయాలో కూడా స్పీకర్‌కు చెప్పిన వైసీపీ బృందం..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను...

వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ... సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే - క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి...

HOT NEWS

[X] Close
[X] Close