రివ్యూ : ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’

boyfriend for hire Movie Telugu Review

తెలుగు360 రేటింగ్: 2/5

కేరింత, మనమంతా, జెర్సీ చిత్రాలలో విశ్వంత్ దుడ్డుంపూడి కి మంచి పాత్రలు దొరికాయి. తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌ కూడా ఆకట్టుకొంది. ఇప్పుడు తను సోలో హీరోగా ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ సినిమా చేశాడు. సంతోష్ కంభంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. టైటిల్ చూస్తే…. న్యూఏజ్ కంటెంట్ ఫీలింగ్ కలిగింది. ట్రైల‌ర్ కూడా ఆస‌క్తి పెంచింది. ప్ర‌చారాన్ని కూడా కాస్త కొత్త‌గానే చేశారు. మారి ఇవ‌న్నీ క‌లిసి.. ఈ బోయ్ ఫ్రెండ్ ని గెలిపించాయా? లేదా?

అర్జున్ (విశ్వంత్) పై త‌న‌ బాబాయ్ (హర్ష వర్ధన్ ) ప్రభావితం ఎక్కువ‌. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటే అమ్మాయిలతో స్నేహం చేయడం మానేస్తాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగంలో చేరుతాడు. ఇంట్లో పెళ్లి చేసేయాలని నిర్ణయిస్తారు. అసలే అమ్మాయిలంటే భయం, చిరాకు రెండూ వుండే అర్జున్ తనకు కావాల్సిన అమ్మాయిని అన్వేషించే క్రమంలో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ కాన్సెప్ట్ ని ఎంచుకుంటాడు. అమ్మాయిలకు అద్దె ప్రియుడిగా ఉంటూ కేవలం వారి సమస్యలు పరిష్కరిస్తూ వారిలో తనకు కావాల్సిన అమ్మాయి లక్షణాలని అన్వేషిస్తుంటాడు. మరి అర్జున్ కోరుకునే లక్షణాలతో వున్న అమ్మాయి దొరికిందా.. లేదా ? అనేది మిగతా కథ.

ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే టైటిల్ పెట్టారు. కానీ ఇది ఒక క్లీన్ ప్రేమకథ. ‘తనకు కావాల్సిన అమ్మాయి ఇలా వుండాలి” అని క్యాలిటీలా చిట్టా రాసుకొని అమ్మాయి కోసం తిరిగే ఒక కుర్రాడి కథ. దీనికి ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే కాన్సెప్ట్ జోడించారు. అయితే చూడటానికి మాత్రం ఆ ప్రేమ కథ, ఈ కాన్సెప్ట్ రెండూ అంత ఆకర్షిణీయంగా వుండవు. కథ కొత్తదైనా పాతదైనా ఆసక్తికరంగా చెప్పడమే సినిమా విజయ సూత్రం. ఈ విషయంలో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ వెనకబడిపోయింది. దర్శకుడు చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత కొరవడింది.

తెలుగు సినిమాల్లో మిగతా పాత్రలు ఎలా వున్నా హీరో పాత్రపై అలవాటు ప్రకారం కాస్త ఎక్కువ ద్రుష్టి పెడతారు. ఇందులో మాత్రం కాస్త వెరైటీ. తనకు కావాల్సిన అమ్మాయిలో క్యాలిటీల కోసం వెదికే హీరో పాత్ర.. ఎలాంటి క్యాలిటీలు లేకుండా వుంటుంది. బాబాయ్ ఏది చెబితే అది ఫాలో అవుతుంటాడు హీరో. త‌న‌కంటూ ఓ ఆలోచ‌న‌, జ్ఞానం లేనట్లే వుంటుంది. అతను కోరుకునే క్యాలిటీల లిస్ట్ లో ‘ప్రేమ’ అనేదే వుండదు. కానీ అతని పాత్ర ఒక అమర ప్రేమిడుకిలా ప్రవర్తిస్తుంటుంది. దర్శకుడు ఈ పాయింట్ దగ్గరే తడబడినట్లు కనిపిస్తోంది. ప్రేమ మీద క్లారిటీ లేని ఒక కుర్రాడి కథ చెప్పాలనుకుంటే .. దానిని ట్రీట్ చేసే విధానం మాత్రం ఇది కాదు. ఒక సీన్ లో హీరోయిన్ ”అసలు ప్రేమ గురించి నీకేం తెలుసు.. ఒక సిల్లీ లిస్టు పెట్టుకొని తిరుగుతున్నావ్’ అని చిరాకు పడుతుంది. సరిగ్గా ప్రేక్షకుడి ఫీలింగ్ కూడా ఇదే.

హీరోయిన్ పాత్రలో కూడా లోపాలు వున్నాయి. హీరో రాసుకున్న లిస్టు ప్రకారం .. అందులో ఒక్క క్వాలిటీ కూడా హీరోయిన్ కి వుండదు. క్వాలిటీ అనేది ముక్కు, చెవి లా బయటికి కనిపించేది కాదు. పరిస్థితుల ప్రకారం బయటపడుతుంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసి హీరోయిన్ లో ఆ ల‌క్ష‌ణాలు లేవు అంటే చూసిన ప్రేక్షకులు నమ్ముతారు. కథలోకి వెళతారు. అంతేగానీ కేవలం డైలాగులతో సరిపెట్టడానికి సినిమా అనేది రేడియో ప్లే కాదు కదా. సన్నివేశ బలం ఉండాల్సిందే. ఆ బలమే ఈ కథలో లోపించింది.

‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. దానిని డ్రామాలో భాగం చేయలేకపోయారు. సినిమాకి టైటిల్ పెట్టుకోవడానికి ఆ కాన్సెప్ట్ పనికొచ్చింది తప్పితే దాని వలన ఈ కథకు చేకూరిన లాభం ఏమీ లేదు. ఆ కాన్సెప్ట్ తో ఈ కథకు మంచి ఫన్ ఇచ్చే ఛాన్స్ వుంది. కానీ ఆ కాన్సెప్ట్ ని పట్టుకొని హీరో క్వాలిటీ లిస్టు రాయడానికే సరిపోయింది. విక్కి డొనర్ బేసిగ్గా ప్రేమ కథ. దానికి వీర్యదానం కాన్సెప్ట్ ని యాడ్ చేసి వైవిధ్యమైన ప్రేమ కథగా మార్చారు. మొన్న వచ్చిన స్వాతిముత్యంలో కూడా అదే జరిగింది. నూతన దర్శకుడు సంతోష్ కంభంపాటి ఆలోచన కూడా ఇదే. ఆలోచన బావుంది కానీ ఇటు ప్రేమకథ, అటు కాన్సెప్ట్ .. రెండిట్లో దేనికీ సరైన న్యాయం జరగలేదు.

ఇందులో మెచ్చుకోదగ్గ అంశాలు కూడా వున్నాయి. ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’.. టైటిల్ చూసి ఇది బోల్డ్ సినిమా అని బెట్ కడితే మాత్రం చిత్తుగా ఓడిపోతారు. చాలా క్లీన్ సినిమా ఇది. సీన్స్ , డైలాగ్స్ లో ఎక్కడా అసభ్యత లేదు. దర్శకుడు అనుకున్న కథ అంత ఆసక్తి కలిగించలేదు కానీ తను మాత్రం చాలా డీసెంట్ గా సినిమాని ప్రజంట్ చేశాడు.

ఎప్ప‌టిలా విశ్వంత్ దుడ్డుంపూడి స్క్రీన్ ప్రజన్స్ బావుంది. పాత్రని తీర్చిదిద్దిన విధానంలో కొన్ని లోపాలు వున్నాయి కానీ అతని నటనకి వంక పెట్టలేం. చాలా డీసెంట్ గా చేశాడు. మాళవిక నిండుగా కనిపించింది. తన నటన కూడా బావుంది. హర్ష వర్ధన్ పాత్ర ఈ కథలో కీలకం కానీ దర్శకుడు తనని సరిగ్గా వాడుకోలేదు. మధునందన్, రాజా రవీందర్, మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. చివర్లో నెల్లూరు సుదర్శన్ నవ్వించే ప్రయత్నం చేశాడు.

కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు కనిపించాయి. లిమిటెడ్ లోకేషన్స్ లో చాలా బ్రైట్ గా తీశారు. కాపీ షాప్ లో ఒక సీన్ సుదీర్గంగా జరుగుతుంది. కథలో చాలా సందర్భాల్లో ఆ లొకేషనే కనిపిస్తుంది. కానీ అది రిపీట్ గా అనిపించదు. ఈ విషయంలో దర్శకుడు పనితీరుని మెచ్చుకోవాలి. గోపీ సుందర్ పాటల్లో మెరుపులు లేవు. నేపధ్య సంగీతం హెవీగా చేశాడు కానీ సీన్స్ లో ఎమోషన్స్ లేకపోవడంతో కేవలం ఆర్ఆర్ మాత్రమే విడిగా వినిపిస్తుంది. కెమెరాపనితనం నీట్ గా వుంది. ఎడిటర్ సెకండ్ హాఫ్ ని మరింత షార్ప్‌ చేయాల్సింది.

న్యూ ఏజ్ కంటెంట్ అంటే కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం మాత్రమే కాదు. వాటిని కొత్తగా, ఆసక్తికరంగా చెప్పగలగాలి. కొత్త కాన్సెప్ట్ ని జోడించి ఒక ప్రేమకథని చెప్పాలని చూసిన దర్శకుడి ప్రయత్నం మాత్రం మనోరంజకమైన అనుభూతిని ఇవ్వలేకపోయింది.

ఫినిషింగ్ ట‌చ్‌: బోరింగ్ ఫ్రెండ్‌

తెలుగు360 రేటింగ్: 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close