“బ్రహ్మం గారి మఠం” వారసత్వ వివాదాన్ని పెంచుతోందెవరు..?

బ్రహ్మంగారి మఠం వారసత్వం విషయంలో ఏర్పడిన వివాదంలో ప్రభుత్వం సమస్యను పరిష్కరించకబోగా… రెండు వర్గాల మధ్య మరింత గొడవలు ముదిరేలా చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణం ఏదో ఓ నిర్ణయం తీసుకుని.. ఒకరికి సర్దిచెప్పి.. మఠం నిబంధనల ప్రకారం..మరొకరికి బాధ్యతలు ఇచ్చి ఉంటే.. సమస్య ఉండేది కాదు. కానీ కమిటీలు అని నాన్చి నాన్చి… మఠాధిపతుల్ని మధ్యవర్తిత్వానికి పంపి… సమస్యను పీటముడి పడేలా చేశారు. ఇప్పుడు మఠం నిర్వహణకు ప్రభుత్వం కడప అసిస్టెంట్ కమిషనర్‌ను క్విక్‌ పర్సన్‌గా నియమించింది. ఈ అంశంపై మంత్రి వెల్లంప్లలి స్పందన మరిన్ని సందేహాలు లేవెనత్తుతోంది. మఠాధిపతిపై ధార్మిక పరిషత్‌ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని.. 30 రోజుల ముందు నోటీసులు ఇచ్చి అందరితో చర్చిస్తామని చెప్పుకొచ్చారు.

128 మఠాలలోని సభ్యులతో కమిటీ వేస్తామని కూడా వెల్లడించారు. అంటే వివాదాన్ని ఇప్పుడల్లా పరిష్కరించే పరిస్థితి లేదని కొంత మంది విశ్లేషిస్తున్నారు.

బ్రహ్మంగారి మఠ పీఠాధిపతిగా ఉన్న వీరబోగ వసంత వేంకటేశ్వరస్వామి అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరి భార్యలకూ మగ పిల్లలు ఉన్నారు. ఆయన చినన భార్య కుమారుడికి తన తదనంతరం మఠాధిపతి పదవి దక్కాలని వీలునామా రాశారు. కానీ.. సంప్రదాయం ప్రకారం.. తమ కుమారుడికే పదవి ఇవ్వాలని పెద్ద భార్య పట్టుబడుతున్నారు. అక్కడేవివాదం పీటముడి పడిపోయింది. ఈ వివాదం పరిష్కరించేందుకు ఇటీవల 12 మంది శైవక్షేత్ర పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకొని ఇరు కుటుంబాల మధ్య సయోద్యకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

మరోవైపు.. చనిపోయిన పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి ప్రాణానికి హాని ఉందంటూ డీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామి అసాంఘిక శక్తులతో చేతులు కలిపి.. తమ కుటుంబపై తరచూ దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కొందరు పీఠాధిపతులు మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామికి మద్దతుగా కుట్ర పన్నుతున్నారని రెండో భార్య ఆరోపించారు. పి తమ కుటుంబానికి పీఠం దక్కకుండా చేసి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

నిజానికి ఈ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించి.. పవిత్రమైన మఠాన్ని.. అంతే పవిత్రంగా ఉంచేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కారణం ఏమిటో కానీ.. వివాదం పెరిగి పెద్దదయ్యేలా చూస్తూ ఉండటమే కాదు.. ఇ్పపుడు… ఇప్పుడల్లా పరిష్కారం కాదని చెబుతున్నట్లుగా వందల మందితో కమిటీలు.. చర్చలకు నెల రోజులకు ముందుగా నోటీసులుఇస్తామని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close