అల వైకుంఠ‌పుర‌ములో…. బ్ర‌హ్మీ స్పెష‌ల్ సాంగ్?

బ‌డా సినిమాలు ఈమ‌ధ్య బ్ర‌హ్మానందాన్ని ప‌క్క‌న పెట్టాయి. బ్ర‌హ్మానందం ఆరోగ్యం కూడా ఈమ‌ధ్య బాగోక‌పోవ‌డంతో, బ్ర‌హ్మీ హ‌వా కూడా బాగా త‌గ్గిపోయింది. ఇప్పుడిప్పుడే.. బ్ర‌హ్మీ మ‌ళ్లీ రేసులోకి వ‌స్తున్నాడు. వాల్మీకిలో గెస్ట్ అప్పీరియ‌న్స్‌లో క‌నిపించిన బ్ర‌హ్మీ – ఇప్పుడు ‘అల వైకుంఠ‌పురములో’ కూడా ఛ‌మ‌క్కుమ‌నే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఇటీవ‌ల ‘అల వైకుంఠ‌పుర‌ములో’కి సంబంధించి ఓ పాట‌ని తెర‌కెక్కించారు. ఇదో ఫ్యామిలీ గీతం. స‌ర‌దా సంద‌ర్భంలో సాగే పాట. బ‌న్నీ, పూజా, ట‌బు, ప్ర‌శాంత్‌.. ఇలా ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ఈ పాట‌లో క‌నిపిస్తారు. అయితే ఈ పాట‌కు లీడ్ మాత్రం బ్ర‌హ్మానందం తీసుకుంటాడు. ‘నువ్వు నాకు న‌చ్చావ్‌’లో ఆకాశం దిగివ‌చ్చి అనే పాట బాగా పాపుల‌ర్ అయ్యింది. చాలా ఫ‌న్నీగా ఉండే పాట‌ల్లో అదొక‌టి. ఇప్పుడూ అలాంటి పాటే త్రివిక్ర‌మ్ డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. దానికి బ్ర‌హ్మీ ఫ‌న్ యాడ్ అవుతుంద‌నిపించి… ఈ పాట కోసం ఆయ‌న్ని తీసుకున్నారు. బ్ర‌హ్మీ ఈ ఒక్క పాట‌లో మాత్ర‌మే క‌నిపిస్తాడు. సినిమాలో మ‌రెక్క‌డా.. ఆయ‌న పాత్ర తార‌స ప‌డ‌ద‌ట‌. అన్న‌ట్టు ఈమ‌ధ్య త్రివిక్ర‌మ్ కూడా బ్ర‌హ్మానందాన్ని దూరం పెట్టాడు. అఆ, అజ్ఞాత‌వాసి, అర‌వింద స‌మేత చిత్రాల్లో బ్ర‌హ్మానందం లేడు. మ‌ళ్లీ… ఇప్పుడు ఆయ‌న త‌న సినిమాల్లో బ్ర‌హ్మీకి చోటిచ్చాడు. మ‌రి ఈ పాట తెర‌పై ఎంత వినోదం అందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com