బ్రహ్మోత్సవానికి పోటీ అది మాత్రమే..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియోకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆడియో 24న అని కొందరంటుంటే కాదు మే 1న అని మరికొందరు అంటున్నారు. మరి బ్రహ్మోత్సవం ఆడియోపై ఏర్పడ్డ ఈ కన్ ఫ్యూజన్ చిత్ర దర్శక నిర్మాతలే క్లారిటీ ఇవ్వాలి. ఇక సినిమాను కూడా మే నెలలో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమ్మర్ వార్ లో ఇప్పటికే సర్దార్ చల్ల బడగా సరైనోడు తన సత్తా చాటేందుకు వస్తున్నాడు.

ఇక మే నెల మొత్తం మహేష్ బ్రహ్మోత్సవం ఒక్కటే ఉంది. అందుకే దానికి పోటీగా సూర్య 24 సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రజిని కబాలి ముందు మేలో రిలీజ్ అనుకున్నా అది జూన్ కు పోస్ట్ పోన్ అయ్యింది. ఇక సూర్య త్రిపాత్రాభినయం చేసిన 24 సినిమా టైం మిషన్ బ్యాక్ డ్రాప్ తో ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ లో వస్తుంది. ఎప్పటిలానే సూర్య తన విలక్షణ నటనతో మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇక బ్రహ్మోత్సవం కూడా తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అసలైన వేసవి పోటీ మహేష్, సూర్య సినిమాల మధ్యే జరుగనున్నది అన్నది తెలుస్తుంది. ఇక ఈ మే నెలలోనే మాటల మాత్రికుడు త్రివిక్రం తన ‘అఆ’ సినిమాను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి వేసవి జోరులో పోటీ పడుతున్న ఈ సినిమాల్లో ఏ సినిమా విజయ పతాకాన్ని ఎగురవేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close