‘బృంద’ వెబ్ సిరిస్ రివ్యూ: త్రిష థ్రిల్ చేసిందా?

హీరోయిన్ గా లాంగ్ కెరీర్ చూసిన నటి త్రిష. ఆమెతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు హీరోయిన్స్ అంతా ఫేడ్ అవుట్ అయ్యారు. కానీ త్రిష కెరీర్ ఇప్పటికీ టాప్ లీగ్ లో వుంది. చిరు విశ్వంభరతో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమెతో చేతిలో వున్నాయి. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టింది. త్రిష చేసిన తొలి వెబ్ సిరిస్ ‘బృంద’. ఈ వెబ్ సిరిస్ తాజాగా సోనీలీవ్ లో ప్రసారమైయింది. మూఢనమ్మకాల ఇతివృత్తంతో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సిరిస్ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? ఇందులో ఆడియన్స్ ని థ్రిల్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?

ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది బృంద(త్రిష). తనది కాస్త భిన్న స్వభావం. కలివిడిగా వుండదు. సహచరులకు కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పదు. తనపనేదో తనది. పైగా తనకేవో జ్ఞాపకాలు వెంటాడుతుంతాయి. స్టేషన్ లో మిగతా అధికారులు కూడా ఆమెని పెద్దగా పట్టించుకోరు. బృంద పని చేసే పోలీష్ స్టేషన్ పరిధిలోని చెరువు దగ్గర ఓ డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ బాడీ చూసిన బృంద పై అధికారి సూసైడ్ అని నిర్ధారణకు వచ్చి కేసుని క్లోజ్ చేయమని ఆర్డర్ వేస్తాడు. అయితే ఈ కేసుని కాస్త లోతుగా పరిశీలించిన బృంద.. అది సూసైడ్ కాదని, మ‌ర్డ‌ర్ అని అనుమానిస్తుంది. దీనికి తగిన ఆధారాలు కూడా చూపుతుంది. దీంతో కేసుని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారి ‘సిట్’ ఏర్పాటు చేస్తారు. ఈ కేసు విచారణలో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తాయి. ఏమిటా నిజాలు? హంతుకుడు ఎవరు? అతని లక్ష్యం ఏమిటి? బృంద గతం ఏమిటి? ఈ కేసులో తను ఎదుర్కున్న సవాళ్ళు ఏమిటి? ఇదంతా మిగతా సిరిస్.

Also Read : ‘విశ్వంభ‌ర‌’లో త్రిష డ‌బుల్ బొనాంజా!

మంచి సిరిస్ కి కొలమానం ఒక్కటే. ఒక ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఇంక బ్రేక్ పడదు. ఆ ప్రవాహం ఆగదు. మిగతా ఎపిసోడ్స్ అన్నీ పూర్తి చేయగల ఓపిక, ఉత్సాహం ఆటోమేటిక్ గా ప్రేక్షకుడిలో క్రియేట్ అయిపోతుంది. బృంద కూడా అలాంటి సిరిసే. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ (ఒకొక్క ఎపిసోడ్ దాదాపు నలభై నిమిషాల నిడివి) గల ‘బృంద’ సింగిల్ సిట్టింగ్ లో ఫినిష్ చేసేటంత థ్రిల్లింగ్ కంటెంట్ వున్న వెబ్ సిరిస్.

ఇది క్రైమ్ థ్రిల్లర్స్ కి వున్న రొటీన్ టెంప్లెట్ వున్న కథే. ఒక హత్య జరుగుతుంది. దీనికి వెనుక ఒక బలమైన కారణం వుంటుంది. హంతకుడికి కొన్ని లక్ష్యాలు వుంటాయి. కేసు విచారణలో ఒకొక్క నిజం వెలుగు చూస్తుంది. చివరికి హంతకుడు పోలీసుల చేతిలో అంతమౌతాడు. బృంద కథ కూడా ఇదే సెటప్. కానీ కథలోని ఇతివృత్తం, హంతకుడు ఎంచుకున్న దారి ఈ సిరిస్ ని కొత్తగా నిలిపాయి.

మూఢనమ్మకాల బాధితుల కథ ఇది. నిజానికి చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని దర్శకుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ గా మలచిన తీరు ఆకట్టుకునేలా వుంటుంది. అడవిలో ఓ బిడ్డని బలివ్వడానికి గ్రామస్తులు నిర్ణయించుకున్న సన్నివేశంతో కథ మొదలౌతుంది. ఆ సీన్ తో ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. అక్కడ దర్శకుడు వేసుకున్న స్క్రీన్ ప్లే అంతలా వర్క్ అవుట్ అయ్యింది. బృంద గతాన్ని కూడా తొలి ఎపిసోడ్ తోనే రివిల్ చేస్తూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కథని నడిపిన విధానం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా వుంటుంది.

హత్య కేసు తెరపైకి రావడం, ఆ విచారణ, హంతకుడిని తొలి ఎపిసోడ్ లోనే చూపించేయడం.. చకచక జరిగిపోతాయి. హంతకుడి బ్యాక్ స్టొరీతో పాటు బృంద గతాన్ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. ఈ కేసు విచారణలో వెలుగు చూసిన నిజాలు, సైకో కిల్లర్ తీగలాగితే డొంక కదిలిన తీరు, కిల్లర్ లక్ష్యాలు, మాస్ మర్డర్స్.. ఇవన్నీ గగుర్పాటుకి గురి చేస్తాయి. ఈ కథ ఎక్కడ మొదలైయిందో అక్కడే పూర్తి చేసిన విధానం కూడా బావుంది.

Also Read : బడ్డీ రివ్యూ: ‘బొమ్మ’ హిట్టా-ఫట్టా ?

అయితే ఇందులో మైనస్సులు లేకపోలేదు. థ్రిల్లర్స్ లో క్లూస్ ని కలెక్ట్ చేసిన విధానం ఎక్సయిటింగ్ గా వుండాలి. కానీ ఇందులో బృందకి చాలా రొటీన్ గా ఆధారాలు దొరికిపోతుంటాయి. అలాగే బృంద సిస్టర్ ట్రాక్ కథకి యాడ్ ఆన్ అవ్వలేదు, దీంతో పాటు సిఐ క్యారెక్టర్ తో బృందకి వున్న కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా కుదరలేదు. సత్య (రాకేందు మౌళి) ఫ్లాష్ బ్యాక్ అవసరానికి మించి సాగదీశారు. దాన్ని ఇంకాస్త షార్ఫ్ గా చెప్పాల్సింది. అలాగే సైకో కిల్లర్ ఎంచుకున్న దారి, తన బ్యాక్ స్టోరీ లో బాలీవుడ్ అసుర్ సిరీస్ ఛాయలు కనిపిస్తాయి.

బృంద క్యారెక్టర్ లో త్రిష నటన చాలా సెటిల్డ్ గా వుంటుంది. తీవ్రమైన మానసిక క్షోభని మోస్తూనే పోలీస్ గా రాణించిన ఈ పాత్ర త్రిష కెరీర్ లో గుర్తుపెట్టుకోదగ్గదే. తన స్క్రీన్ ప్రజెన్స్ నేచురల్ గా వుంది. సారధిగా చేసిన రవీందర్ విజయ్ పాత్ర డీసెంట్ గా వుంది. కానీ ఆ క్యారెక్టర్ ని కాస్త తగ్గించేశారనే ఫీలింగ్ కలిగింది. కేసులో అతని కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. బృందకి ఒక హెల్పర్ గా ట్రీట్ చేశారు. కబీర్ ఆనంద్ గా చేసిన ఇంద్రజిత్ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. థాకూర్ పాత్రలో కనిపించిన ఆనంద్ సామి గుర్తుండిపోతాడు. రాకేందు మౌళి కొత్తగా కనిపించాడు. తనకి నటుడిగా కూడా మంచి భవిష్యత్ వుంది. రఘు పాత్రలో చేసిన జయ ప్రకాష్ ది కూడా కీలక పాత్రే. ఆమనితో సహా మిగతా నటులు పరిధిమేర కనిపించారు.

దర్శకుడు సూర్య మనోజ్ వంగల కథ, కథనాలు రాసుకున్న తీరు, తీసిన విధానం బావుంది. శక్తి కాంత్ నేపధ్య సంగీతం మరో ఆకర్షణ. చాలా చోట్ల బిజీఎం హాంటింగ్ గా వుంటుంది. దినేష్ కెమరాపనితనం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాగా కుదిరాయి. టెక్నికల్ గా మంచి ఎఫర్ట్ కనిపిస్తుంది.

చాలా సెన్సిటివ్, కొంచెం బ్యాలెన్స్ తప్పినా వివాదానికి తావిచ్చే టాపిక్ ఇది. ఇలాంటి కథలకు ఒక సైడ్ తీసుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ విషయంలో దర్శకుడు కూడా ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. చెప్పాల్సిందంతా చెప్పి.. చివరికి.. ”దేవుడు ఉన్నాడని చేయకూడదు, లేడని చెడు చేయకూడదు’ అనే సందేశంతో ముగించారు. టోటల్ గా ఈ వీకెండ్ మంచి థ్రిల్లర్ చూడాలనుకునే ఆడియన్స్ కి బృంద బెస్ట్ ఛాయిసే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close