ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేబినెట్ విస్తరణ చేయడం నిబంధనలకు విరుద్ధమని బీఆర్ఎస్, బీజేపీ అంటున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. గతంలో గోవాలో ఇలాగే సీఎం మనోహర్ పారీకర్ కేబినెట్ ను విస్తరించడానికి ప్రయత్నిస్తే ఎన్నికల సంఘం ఆపేసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికే కేబినెట్ విస్తరణ అని బీజేపీ అంటోంది.
అయితే ముఖ్యమంత్రికి కేబినెట్ విస్తరించుకునే హక్కు ఉంటుంది. ఎన్నికల కమిషన్ కు ఇలాంటి సమస్య వస్తుందని ఊహించలేదేమో కానీ ఎప్పుడూ కేబినెట్ విస్తరణ వివాదం కాలేదు. ఒక్క సారిగా గోవా సీఎం చేయాలనుకున్నారు కానీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ ముహుర్తం ఖరారు చేశారా లేదా అన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనకు సమాచారం లేదని అంటున్నారు.
అజహర్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకోవడం పూర్తిగా రాజకీయమే. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మైనార్టీల ఓట్లను ఏకపక్షంగా పోల్ చేసుకోవడానికి ఈ ప్లాన్ వేశారు. ఒక వేళ .. ఈసీ నుంచి ఒత్తిడి వచ్చి ప్రమాణ స్వీకారం ఆపేసినా.. దాన్ని ఆపేశారని బీఆర్ఎస్, బీజేపీపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అది కాంగ్రెస్ కే లాభం చేకూరుస్తుంది. కోడ్ ముగియగానే మైనార్టీల నుంచి మంత్రి వస్తారని హామీ ఇచ్చి.. తమ ప్రయోజనాలను.. మంత్రి వర్గ విస్తరణ చేయకుండానే ఖరారు చేసుకునే అవకాశం ఉంది.
