బీజేపీతో బీఆర్ఎస్ విలీన చర్చల గురించి బయట పెట్టిన సీఎం రమేష్ గురించి.. బీఆర్ఎస్ నేతలుసైలెంట్ అయిపోయారు. కేటీఆర్ నేరుగా అసలు సీఎం రమేష్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. టెండర్ల గురించి, కాంట్రాక్టర్ల గురించి కూడా మాట్లాడటం లేదు. జగదీష్ రెడ్డి.. ఒకటి, రెండు రోజులు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడటం లేదు. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల విషయంలో మౌనం పాటిస్తే చాలని ఇక దాన్ని పెద్దది చేసుకోవద్దని పార్టీ నేతలకు సూచనలు అందినట్లుగా తెలుస్తోంది.
సీఎం రమేష్ తో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా సున్నితమైన వాటిని సీఎం రమేష్ బయట పెట్టారు. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలపై కేటీఆర్ చేసినట్లుగా సీఎం రమేష్ చెప్పిన వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే జరుగుతున్న విలీనం పుకార్లకు సీఎం రమేష్ చేసిన ప్రకటన మరింత ఆజ్యం పోసినట్లయింది. వీటిపై ఎంత ఎక్కువ చర్చ జరిగితే బీఆర్ఎస్ కు అంత నష్టం జరుగుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో ఆ మాటల్ని కేటీఆర్ లేదా మరో కీలక నేత ఖండిస్తే.. సీఎం రమేష్ సీసీ ఫుటేజీ బయట పెడతానంటున్నారు. అందుకే ఎవరూ ఖండించడం లేదు. భేటీ కాలేదని.. విలీనం ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లాలని కోలేదని చెప్పడంలేదు. కానీ తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్న డైలాగులు చెబుతున్నారు. మొత్తం సీఎం రమేష్ తో అనవసరంగా లొల్లి పెట్టుకోవడంతో పెద్ద డ్యామేజ్ జరిగిందని.. వీలైనంత సైలెంటుగా ఉంటే బెటరని బీఆర్ఎస్ పెద్దలు అనుకుంటున్నారు.