పెట్టుబడుల సదస్సు పొలిటికల్ ఈవెంట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. తెలంగాణకు చెందినది. అక్కడ ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చినా అది తెలంగాణకే మేలు చేస్తుంది. అయినా విపక్షం భారత రాష్ట్ర సమితికి మాత్రం ఇది ఇష్టం లేనట్లుగా ఉంది. సమ్మిట్ ప్రారంభానికి ముందు నుంచే వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. టెంట్లులో చేస్తున్నారని.. ఆంధ్రా కాంట్రాక్టర్లు అని విమర్శలు ప్రారంభించారు. తర్వాత ఒప్పందాలు చేసుకుంటూంటే.. ఒక్కొక్క కంపెనీ మీద వ్యతిరేక ప్రచారం చేయడం ప్రారంభించారు.
ఒప్పందాలు చేసుకుంటున్న కంపెనీ లా. ఇతర కంపెనీలు ఉంటే వాటిని తీసుకు వచ్చి అదే కంపెనీ పెట్టుబడుల ఒప్పందం చేసుకుందని.. ఆ కంపెనీ దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యతిరేక ప్రచారం చాలా ఉద్ధృతంగా సాగుతోంది. పెట్టుబడుల సదస్సు గురించి పాజిటివ్ గా చెప్పకపోయినా
వ్యతిరేక ప్రచారం చేసే విషయంలో కాస్త సంయమనం పాటిస్తే బాగుండేదన్న అభిప్రాయం ఎక్కువ రాజకీయేతర వర్గాల్లో వినిపస్తోంది. తెలంగాణకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఇక్కడ కలుషిత రాజకీయ వాతావరణం ఉందనుకునేలా ఈ పోస్టులు, ప్రచారాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం డమ్మీ ఎంవోయూలు చేసుకుంటే వాటిని ఖచ్చితంగా బయట పెట్టాలి. సమ్మిట్ లో లోపాలుంటే ప్రశ్నించాల్సిందే. కానీ అసలు ప్రారంభం కాక ముందే.. వ్యతిరేకించాలి.. నెగెటివ్ ప్రచారం చేయాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తే ఇదేం పద్దతి అనుకుంటారు. ఇప్పుడు అదే ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు మేలు జరుగుతూంటే.. పెట్టుబడులు వస్త్తూంటే ఓర్చుకోలేకపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.