జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని… అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తిగా అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే మార్పు,చేర్పులు చేస్తామని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో చెప్పారు. నిజానికి ఇది గెలిచినప్పుడు కూడా చెప్పారు.కానీ ఏడాదిన్నరలో ఏ చర్యలూ తీసుకోలేదు. కొత్తగా అసెంబ్లీలో చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇదో ఆయుధం అయిపోయింది. ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం వెంటనే కొన్ని జిల్లా రద్దు, కొన్ని కొత్త జిల్లాలు అంటూ ఫేక్ న్యూస్ ప్రారంభించారు. కాంగ్రెస్ నేతల కుటుంబసభ్యుల పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. సిద్ధిపేట జిల్లాను రద్దు చేస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు.
ఇలా వారు ప్రచారం చేయడం .. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ రాజకీయాలు ప్రారంభించడం కూడా జరిగిపోయాయి. హరీష్ రావే వెంటనే రంగంలోకి దిగారు. సిద్ధిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. కోపం ఉంటే తనపై చర్యలు తీసుకోవాలి కానీ తన జిల్లా జోలికి రావొద్దని ఆయన చెబుతున్నారు. హరీష్ రావు ప్రకటన చూసి చాలా మంది నిజంగానే సిద్ధిపేట జిల్లా రద్దు ప్రభుత్వం చేస్తోందా అని అనుమానపడుతున్నారు.
కానీ అన్నీ బీఆర్ఎస్ నేతలే చేస్తున్నారు. కనీసం జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ఇంత వరకూ కమిటీని కూడా వేయలేదు. ఎప్పుడు వేస్తారో కూడా తెలియదు. కానీ వారి రాజకీయం మాత్రం ప్రజల్లో నిప్పు రాజేసేందుకు అడుగులు వేయడం ప్రారంభమయింది.
