బీఆర్ఎస్ పార్టీని క్రమంగా యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్. ఏర్పాటు చేశారు. ఆ రోజున కేసీఆర్ పార్టీ ఆఫీసుకు వస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అందరికీ ఆహ్వానాలు పంపారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ చూపిన నిర్లక్ష్యం మీద సమావేశంలో చర్చిస్తారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపిణీలో తెలంగాణ హక్కులను కాపాడటంలో విఫలమయిందని.. ఆందోళన కార్యక్రమలపై చర్చిస్తారు. బీఆర్ఎస్ పాలనలో 91 TMC కృష్ణా నీటి కేటాయింపు సాధించగా, కాంగ్రెస్ ప్రభుత్వం 45 TMCకి మాత్రమే అంగీకరించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇది పలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతుల హక్కులపై ద్రోహమని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే పార్టీ సంస్థాగత పరిస్థితుల సమీక్ష, తెలంగాణ హక్కులను కాపాడటానికి భవిష్యత్ ఉద్యమాల కోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారు.
కేసీఆర్ చాలా కాలంగా పార్టీ రోజువారీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. గతంలోనూ ఒకటి, రెండు సార్లు ఎల్పీ మీటింగులు నిర్వహించారు కానీ తర్వాత పెద్దగా కార్యాచరణ లేదు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయినందున పార్టీని మళ్లీ గాడినా పెట్టాల్సిన అనవసరాన్ని కేసీఆర్ గుర్తించారని అంటున్నారు. తెలంగాణ హక్కులను నిర్లక్ష్యం చేయడం అనే టాపిక్ కన్నా.. మరేదీ ప్రజల్ని కదిలించదని..దాన్నే అందుకోవాలని డిసైడయినట్లుగా తెలుస్తోంది.
