గుట్టు అంతా బుచ్చి బాబు గుప్పిట్లోనే !?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌ బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. బుచ్చిబాబు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో ఆడిటర్‌గా పని చేశారు . అలాగే లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్నా రామచంద్ర పిళ్లై కు కూడా సీఏా గోరంట్ల బుచ్చిబాబు పని చేశారు. మంగళవారం సీబీఐ అధికారులు బుచ్చిబాబును ప్రశ్నించారు. విచారణ తర్వాత రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నేటి ఉదయం అధికారికంగా బుచ్చిబాబు అరెస్టును ప్రకటించారు.

గతంలో ఇదే కేసులో ఈడీతో పాటు సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు మనీ లాండరింగ్ చేయడానికి అనుకూలంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్ోతంది. ఈ కేసులో ఆప్‌ నేతల తరఫున సౌత్‌గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులు ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు అందాయని సీబీఐ చెబుతోంది.. ఈ లావాదేవీలన్నీ బుచ్చిబాబు ఆడిటింగ్ కంపెనీ కనుసన్నల్లో జరిగినట్లుగా భావిస్తున్నారు

ఈ సౌత్‌ గ్రూపులో కేసీఆర్‌ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి కీలకమని సీబీఐ ఆరోపిస్తోంది . సీబీఐ, ఈడీ అధికారులు ఈ కేసులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెర వెనుక వ్యక్తుల పాత్రల గురించి చార్జిషీట్లతో చెబుతున్నారు. తెర ముందు ప్రముఖ పాత్ర పోషించిన వారిని అరెస్టులు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close