ఎన్టీఆర్‌తో సినిమా.. మ‌రో ముంద‌డుగు

ఉప్పెన‌తో.. ఘ‌న‌మైన అరంగేట్రం చేశాడు బుచ్చిబాబు. త‌దుప‌రి సినిమాకూడా మైత్రీలోనే. మైత్రీ త‌ల‌చుకుంటే హీరోల‌కు కొద‌వా..? అందుకే ఎన్టీఆర్ లైన్లోకి వ‌చ్చేశాడు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఓ క‌థ రెడీ చేస్తున్నాడ‌ని ఇది వ‌ర‌క‌టి నుంచే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఓ స్పోర్ట్స్ డ్రామా అనీ, స‌గం క‌థ ఇప్ప‌టికే… బుచ్చి బాబు ఎన్టీఆర్‌కి వినిపించేశాడ‌ని ఇది వ‌ర‌కే చెప్పేశాం. ఇప్పుడు ఈ సినిమా విష‌యంలో బుచ్చిబాబు మ‌రో ముంద‌డ‌గు వేసేశాడు. మిగిలిన స‌గం క‌థ‌ కూడా ఇటీవ‌లే ఎన్టీఆర్ కి వినిపించేశాడు. ఎన్టీఆర్‌కి సెకండాఫ్ కూడా బాగా న‌చ్చేసింద‌ని, `చేసేద్దాం` అంటూ చేతులు క‌లిపేశాడ‌ని స‌మాచారం.

అయితే బుచ్చిబాబుతో సినిమా ఎప్పుడ‌న్న విష‌యంలోనే క్లారిటీ లేకుండా పోయింది. ఇప్ప‌టికిప్పుడు చేసేద్దాం అంటే త్రివిక్ర‌మ్ స్క్రిప్టు రెడీ అయిపోయింది. ఆ త‌ర‌వాత కూడా క‌మిట్మెంట్స్ ఉన్నాయి. త్రివిక్ర‌మ్ సినిమాకీ, ఆ త‌ర‌వాత చేయ‌బోయే సినిమాకీ మ‌ధ్య చిన్న గ్యాప్ వ‌చ్చినా బుచ్చి బాబు క‌థ సెట్స్‌పైకి వెళ్లిపోతుంది. అయితే ఎన్టీఆర్ సినిమా కంటే ముందు బుచ్చిబాబు మ‌రో సినిమా చేస్తాడా? లేదంటే ఆ స్క్కిప్టు ప‌నులకే స‌మ‌యమంతా కేటాయిస్తాడా? అనేది తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close