నివేదాకు క‌రోనా: వ‌కీల్ సాబ్ టీమ్ లో కంగారు

న‌టి నివేదా థామ‌స్ కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని నివేదా ప్ర‌క‌టించింది. `వ‌కీల్ సాబ్` లో నివేదా ఓ కీల‌క‌పాత్ర చేసింది. ఇటీవ‌ల ప్ర‌మోష‌న్ల‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఇప్పుడు త‌న‌కు క‌రోనా సోక‌డంతో వ‌కీల్ సాబ్ టీమ్ మొత్తం టెన్ష‌న్ లో ప‌డింది. గ‌త వారం రోజులుగా త‌ను … వకీల్ సాబ్ టీమ్ తోనే ప్ర‌యాణం చేస్తోంది. ఛాన‌ళ్ల‌కు, మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. ఈ రోజు కూడా… ప్రింట్ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఏర్పాటు చేశారు. కానీ అవి చివ‌రి నిమిషంలో కాన్సిల్ అయ్యాయి. దాంతో మీడియా ప్ర‌తినిధులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక‌వేళ ఆ ఇంట‌ర్వ్యూ జ‌రిగి ఉంటే – ఈ భ‌యాలు ఇంకొంచెం పెరిగేవి.

వ‌కీల్ సాబ్ టీమ్ అనే కాదు.. చాలా యూనిట్ల‌లో ఈ క‌రోనా భ‌యం ఉంది. ఇటీవ‌ల కొంత‌మంది సినీ సెల‌బ్రెటీలు క‌రోనా బారీన ప‌డ్డార‌ని, అయితే ఆ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌కుండా గోప్యంగా ఉంచుతున్నార‌ని తెలుస్తోంది. క‌రోనా వ‌స్తోంది.. పోతోంది.. పెద్ద స‌మ‌స్య కాదులే… అని వాళ్లంతా లైట్ తీసుకుంటున్నారా? లేదంటే… బ‌య‌ట‌కు చెప్పుకుని లేనిపోని కంగారు పెంచ‌డం ఎందుక‌ని భ‌య‌ప‌డుతున్నారా? అనేది అర్థం కావ‌డం లేదు. క‌రోనా పాజిటీవ్ అని తెలిస్తే.. బ‌య‌ట‌కు చెప్ప‌డ‌మే మంచిది. ఎందుకంటే.. వాళ్ల‌తో ట‌చ్‌లో ఉన్నవాళ్లంతా చెక్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ విష‌యం సినీ సెల‌బ్రెటీలు ఎందుకు మ‌ర్చిపోతున్నారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close