‘ నీది నాది ఒకే కధ ‘ సినిమా పై వర్ధమాన దర్శకుడు సాయి రాజేష్ అభిప్రాయం

హృదయకాలేయం సినిమా దర్శకుడు,కొబ్బరి మట్ట ప్రొడ్యూసర్ … సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియాలో , బయటా ప్రసిద్ధి పొందడానికి తెర వెనుక కర్త , కర్మ , క్రియ అయిన సాయి రాజేష్ ” నీది నాది ఒకే కధ ” సినిమా చూసి తన బ్లాగ్ లో రాసుకున్న స్వగతం. 

నేనిప్పుడు నెల్లూరులో వున్నాను….కాదు కొద్దిగ టెన్షన్ లో, కన్ఫ్యూషన్ లో…బాధలో….జ్ఞాపకల్లో ఉన్నాను…. మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి…ఒక సినిమా అయితే బాగుండు అని ఈ సినిమాకెళ్ళాను….ఇదింకా కన్ఫ్యూషన్ లోకి నెట్టేసింది. ఎందుకంటే ఈ సినిమాలో …హీరోది… నాది ఒకే కథ…

నేను సినిమా తీసాక…మా ఊరు పెద్ద వెళ్ళలేదు….బహుశా 4 ఏళ్లలో ఇది మూడోసారి….రెండు రోజులు కూడా ఉండింది లేదు….ఇప్పుడు ఉండాల్సి వచ్చింది….26 ఏళ్లు… వేరే ఊరంటూ తెలీదు..తెలిసింది మా ఊరొక్కటే… రోడ్లు, అంగళ్ళు… మనుషులు…ఎవరు మారలేదు…నేనెందుకు మారానో అర్థం కాలేదు…

చాలమందిలాగే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు… లెక్కలు చదివే జ్ఞానం అబ్బలేదు….కానీ జీవితంలో “సెటిల్” అవ్వాలంటే ….డిగ్రీ అయినా మన వెనక ఉండాలి అని….నా శక్తికి మించి… నన్ను బలవంతంగా అయినా చదివించాలని MPC లో తోసారు…సినిమా పిచ్చి తప్ప….చదువు ఎక్కడ అబ్బుతుంది…. ఫెయిల్ అయ్యాను….సినిమా డైరెక్టర్ అవ్వాలన్న కల గురించి ఎవరికి చెప్పే ధైర్యం లేదు…. నవ్వుతారన్న భయం…. థియేటర్ లో కాంటీన్ వాడు కూడా తెలీని నాకు …మా ఊరికి 600kms దూరంలో ఉన్న ఫిల్మ్ నగర్ లో ఎవడో ఛాన్స్ ఇస్తాడు అంటే నవ్వటంలో తప్పులేదు…. కానీ జీవితంలో అదొక్కటే కోరిక…

చదవట్లేదు…మీ పెద్దోడు ఏం చేస్తున్నాడు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు….పొద్దున లేస్తే…సినిమాలు, తిండి, బాతాఖాని…”లక్ష్యం” ఉంది….కానీ చెప్పే ధైర్యం లేదు….జీవితం ఎంత దిగజారాలో..అంతకు పదింతలు జారింది…పైగా ప్రేమ….

ముందు “సెటిల్” అవ్వు అంటే….తిరుపతిలో ఒక ఉద్యోగంలో చేరా….సాయంత్రానికి ….నువ్వింకా డైరెక్టర్ కాలేవు…అయిపోయింది అని గుచ్చి గుచ్చి తొలిచేసింది…..పొద్దునకి తిరిగి నెల్లూరు….ఎందుకొచ్చావ్ అంటే చెప్పే ధైర్యం లేదు….ఇంత నెమ్మదస్తుల కుటుంబంలో ఒక సోదాగా తిరగటం…

“యండమూరి” పరిచయం అయ్యాడు..కానీ సినిమాలో లాగా కాకుండా….నిజంగా ధైర్యం వచ్చింది….మా నాన్నని పక్కకి తీసుకెళ్లి నేను సినిమా డైరెక్టర్ అవుతా అని చెప్పా….ఏదో చెప్పటానికి ట్రై చేశారు….ఈ రోజు నుంచి నాకు నచ్చిన దారిలో వెళ్తా…ఎవరు చెప్పినా వినదల్చుకోలేదు అని చెప్పేసా….ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనెవరి మాట వినలేదు….

సినిమాలు కూడు పెడతాయా….లైఫ్ లో కుర్రాళ్లంతా సెటిల్ అవుతుంటే… వీడికేం పోయేకాలం అని అందరూ అనుకున్నారు….సంతోషంగా మనకిష్టమొచ్చింది మనం చేసుకోకపోతే అదేం సెటిల్ అవటం…..సెటిల్ అవటం అనే మాటే అర్థం అయేది కాదు…

7 ఏళ్ళు….అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ రాలేదు…. కానీ ఒక్క క్షణం బాధ పడింది లేదు….మంచి కథలు ఒప్పుకోరా అని మంచి చెడు…లాభ నష్టాలు..ఏమి ఆలోచించకుండా ఒక సినిమా తీసేసా…నేనెవరి మాట వినను… నాకు అనిపించింది చేస్తా అని నచ్చచెప్పుకునేవాడిని…

డైరెక్టర్ అవ్వాలని కోరిక తీరింది….లక్ష్యం తీరిపోయింది….ఇప్పుడేంటి…??? “సెటిల్” అవ్వాలి…అంతేగా….మరి చిన్నప్పటి నుంచి అందరూ చెప్పింది అదేగా…

4 ఏళ్ళయింది….ఇంతకు పదింతలు రిస్క్ చేసి మరో సినిమా మళ్ళీ ఇంకోటి తీసా…పొద్దున లేస్తే పోరాటం…సినిమా పబ్లిసిటీ చెయ్యాలంటే ఎం చెయ్యాలి…పెట్టిన డబ్బు రికవరీ…వచ్చిన పేరు నిలబెట్టుకోవడం….మరో సారి నవ్వించటం…. ఇదే పని….

కానీ లక్ష్యం ఏంటి…..ఏం లేదు…..లక్ష్యం లేని ప్రయాణం….సెటిల్ అవటమా మరి లక్ష్యం…???

నెల్లూరు వచ్చాక….నాకు ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి….అప్పుడు కష్టాలు వుండొచ్చేమో కానీ….డైరెక్టర్ అవ్వాలన్న కల ఎంత గొప్పగా ఉండేది…

ఇప్పుడు ???

ఒక బేకార్…. పనిలేని పనికిమాలిన వాడి జీవితంలో కూడా ఒక కల ఉంటుంది….ఎక్కువ మంది ఊర్లలో అలానే వుంటారు…వాళ్ళకి ఏది సంతోషమో… అది చెయ్యనివ్వండి…

చక్కగా …చదువుకొని…ఒక software ఉద్యోగం చేస్తే…ఈ పనికిమాలిన సినిమాలో కష్టాలు పడేవాడివా…ఈ పాటికి సెటిల్ అయ్యేవాడివి….అని ఇప్పటికి అంటుంటారు…వాళ్లనుకునే సెటిల్…ఎప్పటికి అవలేనేమో….

ఇది పూర్తిగా చదివిన చాలా మంది కుర్రాళ్లకు గతం గుర్తుకు రావొచ్చు….వర్తమానం ఇలానే ఉండొచ్చు….

మీదే కాదు….నీది నాది అదే కథ…

మొదటి ఫ్రేమ్ నుంచి…నా జీవితం నేను చూసుకుంటూనే వెళ్ళా…నేనో ఫెయిల్యూర్ అనిపిస్తోంది…ఇప్పటికైనా లక్ష్యం కరెక్ట్ చేసుకోమంటోంది….

ఇది తెలుగు సినిమాల్లో “అసమర్ధుని జీవయత్ర”. అంత గొప్ప సినిమా….

తీసేప్పుడు లెక్కలు చూసుకోలేదు…గ్రామర్ ఫాలో అవలేదు….హైస్… లోస్…అని రాసుకోలేదు…జీవితం ని కుంచె తో వెండి తెరపైన గీస్తూ పోయాడంతే…

ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నా…కమర్షియల్ పేద్ద సినిమాలకి, హీరోలకి ఈ సారి అవార్డులు ఇస్తే…. ఇంత పెంట రాసి స్టేజి పైకి చెప్పు విసరాలి….అర్జున్ రెడ్డి, ఘాజి …ఇప్పుడు ఇది..

ఎందరో మంచి మనుషులు..ఈ సినిమాకి పని చేశారు….అందరికి నా వందనాలు…

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close