చలో ఛలో… మెట్రోలో నాని, రష్మిక!

విరామం లేదు… విశ్రాంతి లేదు… ఓ సినిమా తరవాత మరో సినిమా… నేచురల్ స్టార్ నాని చకచకా షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నాడు. మెట్రో ట్రైన్ టైపులో రయ్యమంటూ దూసుకెళ్తున్నాడు. అన్నట్టు… ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నాని హైదరాబాద్ మెట్రో హ‌ల్‌చ‌ల్‌ చేశాడు. అదీ ‘ఛలో’ ఫేమ్ రష్మికతో. జాలీగా మెట్రోలో రైడ్‌కి వెళ్లడం, అది పూర్తి చేసుకుని వచ్చేయడం కూడా జరిగాయి. నాగార్జున, నాని హీరోలుగా ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ సినిమాల ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ ఒక మల్టీస్టారర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ మెట్రోలో జరిగింది. నాని, రష్మిక, సంపూర్ణేష్ బాబు తదితరులపై సన్నివేశాలు చిత్రీకరించి ఫస్ట్ షెడ్యూల్‌కి ప్యాకప్ చెప్పారు. ఈ షెడ్యూల్‌లో నాగార్జున లేరని సమాచారం. సెకండ్ షెడ్యూల్‌ నుంచి ఆయన టీంతో జాయిన్ అవుతారట. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘ఆఫీసర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ కంప్లీట్ చేసే పనిలో నాగ్ వున్నారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close