ఇంకా ఎన్నికల మూడ్ నుంచి బుగ్గ‌న బ‌య‌ట‌కి రావ‌ట్లేదు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు పూర్తైపోయాయిగానీ, వైకాపా నేత‌ల విమ‌ర్శ‌లూ ఆగ్ర‌హాలూ అసంతృప్తులూ ఇంకా పూర్త‌వ‌లేదు! ఎన్నిక‌ల ముందు వారి తీరు ఎలా ఉందో, ఇప్పుడూ అదే కొన‌సాగుతూ ఉంది. ఎన్నికలు జ‌రిగిపోయిన త‌రువాత కూడా అధికార పార్టీ మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్ల ఏం లాభం? అయినా… రాబోయేది వారి ప్ర‌భుత్వ‌మే అనే ధీమా వారికి ఉన్న‌ప్పుడు… ఇంకా ఎందుకీ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు? వైకాపా నాయ‌కుడు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి… చంద్ర‌బాబు నాయుడుకి త‌న ప‌రిపాల‌న‌పై న‌మ్మ‌కం లేద‌నీ, అందుకే ప‌సుపు కుంకం, అన్న‌దాత సుఖీభ‌వ లాంటి ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. ఇది ఎప్పుడు చెయ్యాల్సిన విమ‌ర్శ‌? ఇప్పుడేం అవ‌స‌రం? ఎన్నిక‌ల ముందు న‌వ‌ర‌త్నాలు, పెన్ష‌న్ల పెంపు, అమ్మ ఒడి అంటూ జ‌గ‌న్ ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాల హామీలు కూడా ఆయ‌న‌కి గెలుపుపై న‌మ్మ‌కం లేక ఇచ్చిన‌వా..?

రాజ‌ధానిలో ఒక్క నిర్మాణం లేద‌నీ, అన్నీ పిచ్చి మొక్క‌లేన‌నీ, పోల‌వ‌రం అవినీతి ప్రాజెక్ట‌నీ, ప‌ట్టిసీమ అవ‌స‌రం ఏముంద‌నీ, నిధుల కేటాయింపుల్లో నీతి ఎక్క‌డుందంటూ బుగ్గ‌న విమ‌ర్శించారు. ఇసుక‌, మ‌ట్టి, బొగ్గు, ఆల‌య భూములు ఇలా దేన్నీ వ‌ద‌ల‌కుండా చంద్ర‌బాబు నాయుడు దోచుకున్నార‌ని ఆరోపించారు. రాజ‌ధానిలో నాలుగున్న‌రేళ్ల‌పాటు హైకోర్టు ఏర్పాటు చేయ‌లేద‌నీ, ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే కోర్టు తెచ్చార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడుకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందనీ, అందుకే ఆయ‌న‌కి అస‌హ‌నం పెరిగిపోయింద‌ని విమ‌ర్శించారు. ఓప‌క్క 150 సీట్లు వ‌స్తాయంటూనే, ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగింద‌ని అన‌డం అర్థం లేద‌న్నారు.

ఈ ప్రెస్ మీట్ చూస్తుంటే ఏపీలో ఇంకా ఎన్నిక‌లు కాలేదేమో అనిపిస్తుంది.! గ‌త ప్ర‌భుత్వంపై ఇంకా విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌లూ చేసి ఏం సాధిస్తారు..? ఇవ‌న్నీ ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి ఉంటే, వాటిని ప్ర‌జ‌లు న‌మ్మి ఉంటే, వైకాపాకి అనుకూలంగా ఓటు వేసి ఉంటారు క‌దా! వాళ్ల ధీమా కూడా అదే క‌దా. కానీ, వైకాపా నేత‌లే అస‌హ‌నానికి గురౌతూ దాన్ని చంద్ర‌బాబులో చూపించాల‌నే ప్ర‌య‌త్నం ఎందుకు? ఓప‌క్క ఈసీ ద్వారా న‌డిపించాల్సిన మంత్రాంగ‌మంతా న‌డిపిస్తున్నార‌న్న‌ది ప్ర‌జ‌ల్లో చాలామందికి ఉన్న అభిప్రాయం. అన్నీ వారికి అనుకూలంగా ఉన్నాయ‌ని అనుకున్న‌ప్పుడు ఇంకా ఎందుకీ ఆవేద‌న‌? బుగ్గ‌న మాత్ర‌మే కాదు, ఇత‌ర వైకాపా నేత‌లూ దాదాపు ఇదే ట్యూన్ లో ఉన్నారు. ఎన్నిక‌లు జ‌రిగిపోయాక కూడా పాత ధోర‌ణిలోనే విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close