పెద‌వి విరుస్తున్న బ‌న్నీ ఫ్యాన్స్‌

బుధ‌వారం అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా సుకుమార్ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర‌బృందం. ఇప్పుడు ఆ టైటిల్ కూడా ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రానికి `పుష్ష‌` అనే పేరు ఖ‌రారు చేశార‌ని స‌మాచారం. కుమారి, గంగ అనే మ‌రో రెండు టైటిళ్లు కూడా ఈ సినిమా కోసం ప‌రిశీలించారు. అంత‌కు ముందు `సింహాచలం` అనుకున్నారు. చివ‌రికి `పుష్ష‌` ఖాయ‌మైంది. అయితే ఈ టైటిల్ పై స్వ‌యంగా బ‌న్నీ అభిమానులే పెద‌వి విరుస్తున్నారు. టైటిల్ అంత‌గా క్యాచీగా లేద‌ని, ఓ పెద్ద హీరో సినిమాకి ఇలాంటి టైటిళ్లు ప‌నికిరావ‌ని.. బెంగ ప‌డిపోతున్నారు. సింహాచలం, గంగ పేరులో ఏది సెట్ చేసినా బాగుండేద‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాక‌పోతే సుకుమార్ మైండ్ సెట్ వేరు. ఫ్యాన్స్ ఏం ఆలోచిస్తారో, ఎలాంటి అంశాలు కోరుకుంటారో అత‌నికి బాగా తెలుసు. వాటికి అందిస్తూనే త‌న‌దైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో సినిమా తీస్తూ… `నాన్న‌కు ప్రేమ‌తో` లాంటి సాఫ్ట్ టైటిల్ ఎంచుకున్నాడు. `రంగ‌స్త‌లం` అనే టైటిల్ కూడా విన‌గానే నచ్చేయ‌లేదు. పోస్ట‌ర్‌, లోగోతో పాటు చూస్తే బాగా సెట్ట‌య్యింది. `పుష్ష‌` కూడా అంతే కావొచ్చు. రేపు బ‌న్నీ లుక్‌తో పాటు, పోస్ట‌ర్ చూస్తే.. ఈ అనుమానాల‌న్నీ తొల‌గిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close