ఆ రీమేక్‌పై చిరుకి ఇంకా ఆశ‌లున్నాయా?

మ‌ల‌యాళ చిత్రం ‘లూసీఫ‌ర్‌’ని రీమేక్ చేయాల‌న్న‌ది చిరంజీవి ఆలోచ‌న‌. అయితే ఇప్ప‌టిది కాదు. యేడాది క్రితం మాట ఇది. మోహ‌న్‌లాల్ న‌టించిన ఈ చిత్రం మ‌ల‌యాళంలో మంచి విజ‌యాన్ని అందుకుంది. గాడ్ ఫాద‌ర్ స్ఫూర్తితో తెర‌కెక్కించిన సినిమా ఇది. రామ్ చ‌ర‌ణ్‌కి బాగా న‌చ్చింది. చ‌రణ్ ప్రోద్భ‌లంతోనే ఓ నిర్మాత ఈ సినిమా హ‌క్కుల్ని కొన్నాడు. అయితే `లూసీఫ‌ర్‌` డ‌బ్బింగ్ రూపంలోనూ తెలుగులోకి వ‌చ్చింది. అంత‌గా ఆడ‌లేదు. కానీ చ‌ర‌ణ్‌కి ఈ క‌థ‌పై న‌మ్మ‌కం ఎక్కువ‌. అందుకే రైట్స్ కొనిపించాడు. అయితే ఆ త‌ర‌వాత ఏమైందో.. చిరంజీవి ఈ రీమేక్ ని ప‌క్క‌న పెట్టేశాడు. దాంతో చ‌ర‌ణ్ మాట విని, ఈ రీమేక్ రైట్స్ కొన్న నిర్మాత డీలా ప‌డ్డాడు. ఇప్పుడు ఈ రీమేక్‌పై మ‌ళ్లీ ఆశ‌లు చిగురిస్తున్నాయి.

ఇటీవ‌ల చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘లూసీఫ‌ర్‌’ రీమేక్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ సినిమాని రీమేక్ చేయాల‌నుకున్నామ‌ని, అందుకే రైట్స్ కూడా తీసుకున్నామ‌ని వివ‌రించాడు చిరు. కావాలంటే ఈ క‌థ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఇస్తాన‌న్నాడు. దాంతో లూసీఫ‌ర్ రీమేక్ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. నిజానికి ఈ సినిమాకి రీమేక్ చేయాల‌ని చ‌ర‌ణ్ తెద వెనుక ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాడు. కానీ… తెలుగులో ఇలాంటి క‌థ‌లు సెట్ అవ్వ‌వ‌ని భావించి ప‌క్క‌న పెట్టేశాడు. చ‌ర‌ణ్ మాట కాద‌ని చిరు ఈ సినిమా చేసే అవ‌కాశం లేదు. ప‌వ‌న్ ఏమైనా ఆస‌క్తి చూపిస్తే… ఈ రీమేక్ రైట్స్ కొన్నందుకు న్యాయం జ‌రుగుతుంది. లేదంటే.. లేదంతే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close