లాక్‌డౌన్, స్టేలు జాన్తా నై..! అమరావతి స్థలాల్లో ప్లాటింగ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుందంటే.. జరిగి తీరాల్సిందే. హైకోర్టు తీర్పు ఇచ్చినా… కరోనా వచ్చి లాక్‌డౌన్ విధించినా… పట్టించుకోరు. మిగతా విషయాల సంగతేమో కానీ.. అమరావతి పొలాలను.. ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న విషయంలో మాత్రం.. ఈ పట్టుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిలో ఇతరులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం చట్ట విరుద్ధమని.. హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. లాక్ డౌన్ కారణంగా.. ప్రజలు, రైతులు అందరూ ఎవరి ఇళ్లకు వారు పరిమితం అయ్యారు. అయితే.. హఠాత్తుగా.. కొంత మంది అధికారులు.. రాజధాని గ్రామం అయిన ఐనవోలులో.. ఇళ్ల స్థలాల ప్లాటింగ్ వేయడం ప్రారంభించారు. మరో గ్రామంలో .. పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చడానికి ఉన్న అభ్యంతరాలేమిటో చెప్పాలని అభిప్రాయసేకరణ ప్రారంభించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అప్పటికప్పుడు నిలిపివేశారు.

హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం.. అమరావతి భూముల్లో ఇతరులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం కుదరదు. రాజధాని గ్రామాల్లోని ఇళ్లు లేని పేదల కోసం… గత ప్రభుత్వం అపార్టుమెంట్లు కట్టించింది. అవి వారికి సరిపోతాయి. అయితే ప్రభుత్వం రాజధాని భూములను.. ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసి తీరాలన్న పట్టుదలతో ఉంది. అందుకే… హైకోర్టు తీర్పును.. లాక్ డౌన్ ను లైట్ తీసుకుంటోంది. కొద్ది రోజుల కిందట.. గుంటూరు, కృష్ణా కలెక్టర్లకు … ప్లాట్లు వేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని.. పనులు కొనసాగించాలని సూచించింది. దీనిపైనే…అధికారవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

మరో వైపు ఏపీలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సామాజిక వ్యాప్తి ప్రారంభణమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ స్థలాల పేరుతో.. అధికారులను ఊళ్ల మీదకు పంపడటం.. ప్లాటింగ్ చేయించడం..అదీ కూడా కోర్టు ఉత్తర్వులును ఉల్లంఘించడం వంటి వాటితో రైతులు తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రభుత్వం.. కోర్టులను కనీసం గౌరవించడం లేదని.. విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అమరావతి విషయంలో మరీ చట్టాలు, కోర్టులను కూడా పట్టించుకోకుండా… తాను అనుకున్నది చేయడానికి ప్రయత్నించడం.. రాజధాని కోసం రైతులు ఇచ్చిన స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు పంపిణీ చేయాలని పట్టుదలను ప్రదర్శిస్తూండటం… పలువురుని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close