కో అంటే కోట్లు : రాముడికి పారిశ్రామికవేత్తల భక్తి సమర్పణ..!

మైహోమ్ గ్రూప్ రూ. ఐదు కోట్లు..! మేఘా గ్రూపు రూ. ఆరు కోట్లు..! గోకరాజు గంగరాజు గ్రూప్ రూ. ఐదు కోట్లు..! రాంకీ గ్రూప్ అయోధ్య రామిరెడ్డి రూ. ఐదు కోట్లు..! సుజనా చౌదరి రూ.2 కోట్ల 20 లక్షలు..! .. ఈ ప్రవాహం ఇలా సాగిపోతూనే ఉంది. దేశంలోని కార్పొరేట్ కంపెనీల సంగతేమో కానీ.. రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు మాత్రం అయోధ్య రామాలయానికి విరాళాలను కోట్లకు కోట్లు సమర్పించుకోవడంలో ఎక్కడా లేని భక్తిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం ఉన్న పారిశ్రామికవేత్తలు… రాముడ్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. తమ స్థోమతకు తగ్గట్లుగా .. కోట్లలోనే చెల్లింపులు చేస్తున్నారు.

అయోధ్య రాముడికి విరాళాలివ్వడానికి ఏ ఒక్క నేత పార్టీ బేధం పెట్టుకోవడం లేదు. మొత్తంగా విరాళాల సేకరణ బీజేపీ నేతల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. అదేదో తమ సొంత వ్యవహారం అన్నట్లుగా బీజేపీ నేతలు హడావుడి చేస్తున్నారు. అయినప్పటికీ… ఏ ఇతర రాజకీయ పార్టీ నేతలు మరో విధంగా భావించడం లేదు. రాముడికి భక్తి పూర్వకంగా సమర్పించుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలైన బీజేపీ నేతలూ పెద్ద ఎత్తున విరాళం ఇస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తలా కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. అత్యధికుల చెల్లింపులు కోట్లలోనే ఉంటున్నాయి.

అయోధ్య రాముడి ఆలయానికి పదకొండు వందల కోట్లు వరకూ ఖర్చు అవుతుందని.. ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఆలయాన్ని నిర్మించడానికి ఉచితంగా నిర్వహించడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చినప్పటికీ.. ప్రతి ఒక్క భారతీయుడికి చాన్స్ ఇవ్వాలనే విరాళాలు సేకరిస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించే పనిలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారు. ఎలా చూసినా.. కోట్లు ఇవ్వగలిగే పరిశ్రామికవేత్తలు కోట్లు ఇస్తున్నారు.. వందలు ఇవ్వగలికే సాధారణ భక్తులు వందలు ఇస్తున్నారు. ఒక్క తెలంగాణ నుంచే..రూ. వంద నుంచి రెండు వందల కోట్ల వరకూ రాముడి ఆలయానికి నిధులు సమకూరే అవకాశం ఉందని ప్రస్తుత విరాళాల జోరు చూపిస్తున్నవారు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close