ఇండియా టుడే ఈ సారి జగన్‌ను మర్చిపోయిందేంటో..!?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటూ అదే పనిగా పోల్స్ విడుదల చేసే ఇండియా టుడే ఈ సారి తమ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయింది. తాజాగా ప్రకటించిన “మూడ్ ఆఫ్ ది నేషన్” పోల్‌లో మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ కేటగరిలో టాప్ ఫైవ్‌లో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. మొదటగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేరు ఉంది. ఆ తర్వాత కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, ఉద్దవ్ ధాకరే, తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్లు ఉన్నాయి. వీరే టాప్ ఫైవ్.

“మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్” కేటగరిలో రాష్ట్రాల వారీగా ఫలితాలు తీసుకుంటారు. అంటే.. ఒడిషా సీఎంకు 51శాతం ఒడిషా ప్రజల ఆమోదం ఉందన్నమాట. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 41శాతం ఢిల్లీ ప్రజలు, యోగి ఆదిత్యనాథ్‌కు 39 శాతం ఉత్తరప్రదేశ్ ప్రజలు, ఉద్దవ్ ధాకరేకు 35 శాతం మహారాష్ట్ర ప్రజలు, అదే ముఫ్పై ఐదు శాతం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు మద్దతుగా ఉన్నారు. బెస్ట్ చీఫ్ మినిస్టర్‌గా ఓటేశారు. అంటే మిగిలిన రాష్ట్రాల సీఎంకు 35 కన్నా తక్కువ శాతం మంది ప్రజల మద్దతు ఉంది. అందులో జగన్మహోన్ రెడ్డి కూడా ఉన్నారన్నమాట.

అలాగే ఇండియా టుడే బెస్ట్ పర్‌ఫార్మింగ్ సీఎం పేరుతో కూడా ఓ పోల్ నిర్వహించింది. అందులో యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానం పొందారు. తర్వాత స్థానంలో కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ ఉన్నారు. ఈ పోల్‌లో .. అభిప్రాయం వ్యక్తం చేసిన వారు… ఓటేసిన వారు.. ఆ రాష్ట్రానికే ఉండాలనేం లేదు. దేశం మొత్తం మీద ఎక్కడివారైనా సరే వ్యక్తం చేసే అభిప్రాయాన్ని బట్టి రేటింగ్ ఇచ్చారు. ఇందులో మొత్తం వంద శాతం లెక్కలో ఇరవై ఐదు శాతం మంది యోగికి ఓటేస్తే.. పధ్నాలుగు శాతం మంది కేజ్రీవాల్‌కు.. ఎనిమిది శాతం మంది మమతా బెనర్జీకి.. ఆరు శాతం మంది నితీష్ కుమార్‌కు ఓటేశారు. ఆ తర్వాత ఈ లిస్టులో జగన్, ఉద్దవ్ ధాకరే, నవీన్ పట్నాయక్ కూడా ఉన్నారని ఇండియా టుడే చెబుతోంది. అయితే జగన్ ఆరు శాతం కన్నా తక్కువే ఓట్లు వచ్చాయని దీని ద్వారా అర్థమవుతోంది.

ఇండియా టుడే ఎప్పుడు ఫలితాలు ప్రకటించినా.. జగన్ మీడియా పెద్ద ఎత్తున ప్రకటించుకుంటుంది. ఈ సారి సైలెంటయింది. జగన్మోహన్ రెడ్డి ప్లేస్ ఎక్కడా కనిపించలేదు. నిజానికి జగన్ కు ఇండియా టుడే గ్రూప్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. కొన్ని కాంట్రాక్టులు కూడా ఇచ్చారు. అయినా ఈ సారి ఎందుకో… జగన్ పేరు మిస్సయిందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే... ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25...

వైసీపీపై రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్‌కు కోపం ఎందుకు..!?

రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ...

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close