అఫీషియ‌ల్: అక్టోబ‌రు 13న `RRR`

`RRR` టీమ్ నుంచి ఓ కీలక‌మైన అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించేసింది. అక్టోబ‌రు 13న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్టు కొద్దిసేప‌టి క్రిత‌మే ధృవీక‌రించింది. అంతేకాదు… రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌లిసి వున్న స్టిల్ ని విడుద‌ల చేసింది. గుర్రంపై చ‌ర‌ణ్‌.. దౌడు తీస్తుంటే, బైక్ పై ఎన్టీఆర్ రివ్వున దూసుకుకొస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది వ‌ర‌కే.. వీరిద్ద‌రి టీజ‌ర్లూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. క‌లిసి క‌నిపించే స్టిల్ ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. నిజానికి 2020 వేస‌వికి రావ‌ల్సిన సినిమా ఇది. 2021 సంక్రాంతికి వ‌స్తుంద‌నుకున్నారు. 2021 వేస‌వికైనా రావ‌డం ఖాయం అనుకున్నారు. కానీ.. ద‌స‌రాకి వాయిదా ప‌డింది. ఈ రిలీజ్ డేట్ ప్ర‌కటించే ముందు రాజ‌మౌళి చిత్ర‌బృందంతో తీవ్ర‌మైన త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిన‌ట్టు స‌మాచారం. ఈసారి రిలీజ్ డేట్ ఇస్తే.. ఎట్టిప‌రిస్థితుల్లోనూ మిస్ అవ్వ‌కూడ‌ద‌ని.. రాజ‌మౌళి భావించార్ట‌. షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో పాటు పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు ముమ్మ‌రంగా న‌డుస్తుండ‌డంతో.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని, అందుకే… అధికారికంగా ప్ర‌క‌టించేశార‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే... ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25...

వైసీపీపై రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్‌కు కోపం ఎందుకు..!?

రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ...

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close