సీఓటర్ సర్వే : ఏపీ కన్నా తెలంగాణ సర్కార్‌పైనే ఎక్కువ అసంతృప్తి !

సీఓటర్ సంస్థ యాంగర్ ఇండెక్స్ పేరుతో చేసిన ఓ సర్వేలో తెలుగు రాష్ట్రాలకు సంబధించి భిన్నమైన ఫలితాలొచ్చాయి. ఈ సర్వే ప్రజలు ఎవరికి ఓటు వేస్తారన్న అంశంపై కాకుండా… సిట్టింగ్ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఎంత మేర ప్రజాగ్రహానికి గురవుతున్నారన్నది తెలుసుకోవడానికే ఈ యాంగర్ ఇండెక్స్ పేరుతో సర్వే నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రానికిసంబంధించి భిన్నమైన ఫలితాలొచ్చాయి.

ప్రజల అసంతృప్తిలో టాప్ 5లో రెండు తెలుగు రాష్ట్రాలవే !

ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి యాభై శాతం దాటిందంటే డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ దేశంలోనే రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకటో స్థానంలో ఉంది. 66 శాతానికి మందికిపైగా తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ సర్కారుపై ఏపీలో 56.9 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాగ్రహాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న టాప్‌-5 ప్రభుత్వాల జాబితాలో తెలంగాణ ఒకటో స్థానంలో ఉండగా.. ఏపీ నాలుగో స్థానంలో ఉంది.

అసంతృప్తి ఎదుర్కొంటున్న టాప్ జాబితాలో లేని కేసీఆర్.. జగన్ !

ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్నాయి కానీ.. ప్రజల నుంచి అతి ఎక్కువ కోపాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల జాబితా టాప్‌లో వీరి పేర్లు లేవు. మొదటి స్థానం . రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ (35.4% వ్యతిరేకత). ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా బస్వరాజ్‌ బొమ్మై (కర్ణాటక, 33.1 శాతం), నీతీశ్‌ కుమార్‌ (బిహార్‌, 32 శాతం వ్యతిరేకత) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘెల్‌ అతి తక్కువ ప్రజావ్యతిరేకత ఉన్న సీఎంగా నిలిచారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాస్త తక్కువే !

ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త అసంతృప్తి తక్కువగానే నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో 28.5% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వయ్క్తం చేశారు. తెలంగాణలో 23.5% మాత్రమే. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యేల వల్లే పార్టీకి గడ్డు పరిస్థితులు వస్తున్నాయని.. ఆయా పార్టీల అధినేతలు ఎమ్మెల్యేల్ని మందలిస్తున్నారు. కానీ విచిత్రంగా ప్రభుత్వంపైనే ఎక్కువ అసంతృప్తి ఉన్నట్లుగా తెలుతోంది.

చాలా పరిమితమైన శాంపిల్ !

సీ ఓటర్ సంస్థ యాంగర్ ఇండెక్స్ కోసం దేశవ్యాప్తంగా కేవలం పాతిక వేల మంది అభిప్రాయాలను మాత్రమే తీసుకుంది. వారినే రాష్ట్రాల వారీగా విభజించి.. ఫలితాలను ప్రకటించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close