హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ స్పాట్ కేబుల్ బ్రిడ్జి..!

హైదరాబాద్ మరింత ఆకర్షణీయంగా అయింది. మంత్రి కేటీఆర్ తన ఆలోచనకు నిర్మాణ రూపమిచ్చారు. చకచకా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకు వచ్చారు. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. దూరం నుంచే చూస్తేనే మిరుమిట్లు గొలుపుతూ ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ కేబుల్ బ్రిడ్జి.. దీన్ని అనుసంధానం చేస్తూ నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రజావసరాల వినియోగం కోసం ప్రారంభించారు. ఈ తరహా వంతెనలు విదేశాల్లో.. మాత్రమే ఉంటాయి. సినిమా పాటల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ సర్కార్ ఆ సొగసైన నిర్మాణాన్ని హైదరాబాద్‌లోనే చేసింది.

ఈ రహదారి టూరిజం ప్లస్ పాయింట్ కోసం నిర్మించలేదు. ట్రాఫిక్ చిక్కులకు గొప్ప పరిష్కారం ఈ వంతెన. ప్రతీ రోజూ.. కొన్ని వేల మంది వెళ్లే .. ప్రముఖ ఐటీ కంపెనీలున్న మార్గంలో ఇది నిర్మించారు. ఈ ఐకా నిక్‌ బ్రిడ్జి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ తదితర ఐటీ సంస్థల ప్రాంతాలకు అనుసంధానంగా ఉంటుంది. మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారికి 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఎల్ అండ్ టీ ఈ నిర్మాణం చేసింది. 184 కోట్లతో పూర్తి చేశారు. ఇప్పటికే ఇది హైదరాబాద్‌ హ్యాంగింగ్‌ బ్రిడ్జిగా, టూరిస్ట్‌ స్పాట్‌గానూ మారింది. బ్రిడ్జిపైన పాదచారుల సంఖ్య కూడా పెరిగింది.

ఈ బ్రిడ్జిపై ప్రత్యేకంగా ధీమ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కేబుళ్లలకు విద్యుత్ వెలుగులు ఉంాటాయి. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు వివిధ సందర్భాలను బట్టి దాదాపు 25 థీమ్‌లను ఖరారు చేశారు. ఆయా సందర్భాలను బట్టి లైటింగ్‌ను ప్రదర్శిస్తారు. దూరం నంచి చూసేవారికి లేజర్ షో చూసిన ఫీలిం‌ంగ్ కలుగుతుంది. ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్లే వారికి.. విదేశాల్లో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close