కేంద్రంపై న్యాయపోరాటానికి కేసీఆర్‌కు “కాగ్” అస్త్రం..!

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న భావనతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ న్యాయపోరాటం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్‌కు గొప్ప అస్త్రం లభించింది. నిజంగానే కేంద్రం జీఎస్టీ సెస్‌ను దారి మళ్లించిందని అధికారికంగా కంప్ట్రోలర్ అం‌డ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. వాస్తవానికి ఆ నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలి . కానీ ఇవ్వలేదు. కావాలంటే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోండి అని ఆఫర్ ఇస్తోంది. కానీ న్యాయంగా ఇవ్వాల్సిన సొమ్మే కాబట్టి ఇవ్వాలని తెలంగాణ సర్కార్ పట్టు బడుతోంది. ఈ తరుణంలో కాగ్ నివేదిక కొత్త సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

జీఎస్టీ చట్టం ప్రకారం.. రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయం తగ్గితే పరిహారం చెల్లించాలి. ఆ పరిహారం కోసం.. సెస్‌ను కూడా వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలు చేసిన తొలి రెండేళ్లలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కన్నా ఎక్కువగా సెస్ వసూలయింది. ఇది దాదాపుగా రూ. 47వేల కోట్లు ఉంది. ఈ మొత్తం ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది. కానీ.. కేంద్రం ఇవ్వలేదు. యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో నిర్మలా సీతారామన్ వాటిని ఇవ్వడానికి నిరాకరించారు. వేరే మార్గం ద్వారా నిధులు సమీకరించుకోవాలని సూచించారు. ఇలా చేయడం కేంద్రం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేసీఆర్ అంటున్నారు.

ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించిందని కాగ్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ అంశం ద్వారా కేసీఆర్ కేంద్రంపై కోర్టులో న్యాయపోరాటానికి చేయడానికి అవకాశం చిక్కినట్లయింది. జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా… కాగ్ స్పష్టంగా పేర్కొనడంతో.. కోర్టులోనూ.. వాదనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్‌తో పాటు.. ఏపీ లాంటి కొన్ని కేంద్రంపై భయభక్తులతో ఉండే రాష్ట్రాలు మినహా.. మిగతా బీజేపీయేతర అధికార పార్టీలన్నీ.. కేంద్రంపై పోరాటానికే సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో కాగ్ రిపోర్ట్ మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాఘ‌వేంద్ర‌రావు.. ఓ మ‌ల్టీస్టార‌ర్‌!

కె.రాఘ‌వేంద్ర‌రావు మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి నిలిపారు. తాజాగా... శ్రీ‌కాంత్ త‌న‌యుడితో `పెళ్లి సంద‌డి`కి శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం ఆ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారాయ‌న‌. ఈ చిత్రానికి ఆయ‌న ద‌ర్శ‌కుడు కాదు. ద‌ర్శ‌క‌త్వ...

సోనూ రేటు: రోజుకి 20 ల‌క్ష‌లు

ఈ కరోనా స‌మ‌యంలో.. సోనూసూద్ రియ‌ల్ హీరో అయిపోయాడు. హీరోల‌కూ, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, సంస్థ‌ల‌కు ధీటుగా - సేవ‌లు అందించాడు. త‌న యావ‌దాస్తినీ దాన ధ‌ర్మాల‌కు ఖ‌ర్చు పెట్టేస్తున్నాడా? అనేంత‌గా...

స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్...

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

HOT NEWS

[X] Close
[X] Close