అలాగ పద్దులు నిర్వహించడం సరికాదు: కాగ్

తెలంగాణా ప్రభుత్వం ఒకేసారి రెండు పూర్తి భిన్నమయిన అనుభవాలను ఎదుర్కొంది. ప్రధాని నరేంద్ర మోడి నుంచి ప్రశంశలు అందుకొన్న సమయంలోనే కాగ్ నుంచి అక్షింతలు కూడా పడ్డాయి. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి అనువయిన వాతావరణం సృష్టించినందుకు ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తే, నీటి పారుదల శాఖలో పద్దులను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించనందుకు కంప్ట్రోలర్ ఆఫ్ అక్కౌంట్స్ (కాగ్) అక్షింతలు వేసింది. నీతిపారుదల పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిద పధకాల పేరిట నిధులు కేటాయిస్తుంటాయి. అలాగే దేశ, విదేశాలలోని ఆర్ధిక సంస్థల నుంచి అప్పుల రూపంలో నిధులు వస్తుంటాయి. వాటన్నిటికీ దేనికది వేర్వేరుగా పద్ధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నీటి పారుదల పనులను చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి శరవేగంగా చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రభుత్వం అన్ని రకాల నిధులకు కలిపి ఒకే ఖాతా నిర్వహిస్తోంది. తద్వారా పనులకు నిధుల విడుదలలో ఆలస్యం జరగకుండా నివారించవచ్చని ప్రభుత్వ ఉద్దేశ్యం కావచ్చును. కానీ ఆ విధంగా రకరకాల పధకాలు, మార్గాల ద్వారా సీకరించుతున్న భారీ నిదులనన్నిటినీ ఒక్క చోటికి చేర్చినట్లయితే భారీ స్థాయిలో అవినీతి జరిగే అవకాశం కూడా ఉంటుంది కనుక తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న ఆ విధానాన్ని కాగ్ తప్పు పట్టింది. నిధులను ఆ శాఖకు చెందినా అధికారులు ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కూడా చాలా గందరగోళంగా ఉన్నట్లు కాగ్ తేల్చి చెప్పింది. మిగిలిన అన్ని శాఖలు తమకు అందిన నిధుల కోసం ఏవిధంగా వేర్వేరుగా ఖాతాలను ఉపయోగిస్తున్నాయో, నీటి పారుదల శాఖ కూడా అదే విధానం అనుసరించాలని సూచించింది. దానితో తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ పాత విధానంలోనే పద్దులను నిర్వహించాలని నిర్ణయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close